PM Kisan: వచ్చే వారమే రైతుల ఖాతాలోకి.. పీఎం-కిసాన్ నిధులు.. ఇలా చెక్ చేసుకోండి!
PM Kisan: వచ్చే వారమే రైతుల ఖాతాలోకి.. పీఎం-కిసాన్ నిధులు.. ఇలా చెక్ చేసుకోండి!
దిల్లీ: రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం- కిసాన్ పథకం 17వ విడత నిధుల (PM Kisan 17th installment) 2 జూన్ 18న రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఉత్తరప్రదేశ్లోని వారణాసి (Varanasi) పర్యటనలో ప్రధాని మోదీ (PM Modi) ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈమేరకు కేంద్ర వ్యవసా శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ శనివారం వెల్లడించారు.
"మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంది. గత హయాంలోనూ రైతుల ప్రయోజనాల కోసం ప్రధాని అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంత పీఎం-కిసాన్ (PM Kisan) నిధులకుసంబంధించిన దస్త్రంపైనే చేశారు” అని చౌహన్ తెలిపారు. ఈ పథకం ప్రారంభించిన నాటినుంచి ఇప్పటివరకు రూ.3.04 లక్షల కోట్లను అర్హులైన రైతులకు పెట్టుబడి సాయంగా అందించినట్లు పేర్కొన్నారు.
మోదీ ఈనెల 9వ తేదీన వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు పీఎంవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన.. వెంటనే 'పీఎం కిసాన్' 17వ వాయిదా చెల్లింపు దస్త్రంపై సంతకం చేశారు. 2018 నుంచి ఈ పథకం అమలుచేస్తున్నారు. దీనికింద అర్హులైన రైతులకు మూడు విడతల్లో రూ.2వేలు చొప్పున ఏటా రూ.6 వేలు పెట్టుబడి సాయంగా ఇస్తున్నారు. ఈ పథకంతో 9.3 కోట్ల మంది రైతులకు రూ.20 వేల కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది.పేమెంట్ స్టేటస్ ఇలా..
పీఎం కిసాన్ (pmkisan gov.in) వెబ్సైట్ ఓపెన్ చేసి.. అందులో బెనిఫిషియరీ స్టేటస్ పేజీపై క్లిక్ చేయాలి. ప్రత్యేకంగా ఓపెన్ అయ్యే పేజీలో ఆధార్ లేదా అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి. 'గెట్ డేటా' బటన్పై క్లిక్ చేయగానే పేమెంట్ వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ కేవైసీ చేయకపోతే నిధులు జమ కావు. కాబట్టి ఒకవేళ కేవైసీ పూర్తి చేయకు అదే వెబ్సైట్లో ఇ-కేవైసీ బటన్ ను క్లిక్ చేసి ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
తొలిసారి వారణాసికి..
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలిసారిగా తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. ఈనెల 18న అక్కడ సభలో పాల్గొననున్నారు. పీఎం-కిసాన్ నిధ విడుదలతో పాటు 'కృషి సఖీ'గా శిక్షణపొందిన స్వయంసహాయక బృందాల మహిళలకు సర్టిఫికెట్లు అందజేయనున్నారు.