-Advertisement-

School Bus: స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై దృష్టి పెట్టండి..

School bus fitness certificate download School bus fitness certificate School bus fitness certificate online School bus fitness online Daily news Telu
Priya

School Bus: స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై

దృష్టి పెట్టండి

అధికారులకు మంత్రి పొన్నం ఆదేశాలు

హైదరాబాద్, జూన్ 11(పీపుల్స్ మోటివేషన్):

తెలంగాణ వ్యాప్తంగా పాఠశాల బస్సుల ఫిటినెన్పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, ఎన్ఫోర్స్మెంట్స్ను బలోపేతం చేసి చెక్ పోస్టుల వద్ద నిరంతర నిఘా ఉంచాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల్లో రహదారి భద్రతపై అవగాహన కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటేనే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలని సూచించారు. మంగళవారం రవాణాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతి స్కూల్ బస్సు తనిఖీ చేయాలని, ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటేనే రోడ్డు ఎక్కేలా చూడాలని చెప్పారు. 

School bus fitness certificate download School bus fitness certificate School bus fitness certificate online School bus fitness online Daily news Telu

వారం రోజులపాటు స్కూళ్లు, కాలేజీల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. కారు డోర్లకు బ్లాక్ ఫీల్డ్ గ్లాస్ ఉన్న వాటిపై విధిగా తనిఖీలు నిర్వహించాలి. రాష్ట్ర సరిహద్దు చెకపోస్టుల వద్ద ఉన్న ఎన్ఫోర్స్మెంట్స్ను మరింత బలోపేతం చేస్తే అవినీతికి ఆస్కారం లేకుండా ఆదాయం పెంచుకోవచ్చు, సీజ్ చేసిన వాహనాలకు సంబంధించి పాలసీలో ఉన్న విధంగా వ్యవహరించాలి. వాహనాలను భద్రపర్చే ప్రదేశాలపై జిల్లా పోలీస్ అధికారులతో కో-ఆర్డినేట్ చేసుకోవాలి. హైదరాబాద్లో ఆటోరిక్షాలపై ప్రస్తుతం ఉన్న పాలసీతో పాటు సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేలా రూపొందించాలి' అని అధికారులకు దిశానిర్దేశర చేశారు.

Comments

-Advertisement-