-Advertisement-

Telangana TET 2024 Results: తెలంగాణ టెట్ ఫలితాల విడుదల.. అభ్యర్థులకు గుడ్ న్యూస్

TS TET RESULTS tg tet results Ts tet key 2024 pdf Ts tet key 2024 download TS TET official website TS TET Hall Ticket Download 2024 AP TET DSC TS DSC
Priya

Telangana TET 2024 Results: తెలంగాణ టెట్ ఫలితాల విడుదల.. అభ్యర్థులకు గుడ్ న్యూస్

టెట్-2024కు మొత్తం 2,86,381 మంది అభ్యర్థుల దరఖాస్తు 

పేపర్-1 పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరు కాగా 57,725 మంది ఉత్తీర్ణత 

పేపర్‌-2కు 1,50,491 మంది హాజరు కాగా 51,443 అభ్యర్థుల అర్హత..

అర్హత సాధించని వారికి వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు..

అర్హత సాధించిన వారికి డీఎస్సీకి ఉచిత దరఖాస్తు

టెట్‌ ఫలితాలను విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ (పీపుల్స్ మోటివేషన్):-

ఈసారి అర్హత సాధించని వారికి వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటు

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. మొత్తం 2,86,381 మంది అభ్యర్థులు ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరు కాగా 57,725 మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. పేపర్‌-2కు 1,50,491 మంది హాజరయ్యారని, వారిలో 51,443 అభ్యర్థులు అర్హత సాధించారని అధికారులు తెలిపారు.

TS TET RESULTS tg tet results  Ts tet key 2024 pdf Ts tet key 2024 download TS TET official website TS TET Hall Ticket Download 2024 AP TET DSC TS DSC

పేపర్-1లో 67.13 శాతం, పేపర్-2లో 34.18 శాతం మంది అర్హత సాధించారని అధికారులు వెల్లడించారు. 2023తో పోలిస్తే పేపర్-1లో 30.24 శాతం, పేపర్-2లో 18.88 శాతం ఉత్తీర్ణత పెరిగిందని పేర్కొన్నారు. ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ https://schooledu.telangana.gov.in లో చూడొచ్చన్నారు.  

ఈ సందర్భంగా అభ్యర్థులకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్-2024లో అర్హత సాధించని వారికి వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటు కల్పించింది. అదేవిధంగా ఇప్పుడు అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. కాగా, డీఎస్సీ ద్వారా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

Comments

-Advertisement-