Tenth Jobs: టెన్త్ పాస్ అయిన వారికి గుడ్ న్యూస్..పోస్టల్ డిపార్ట్మెంట్లో భారీ గా ఉద్యోగాలు..
Tenth Jobs: టెన్త్ పాస్ అయిన వారికి గుడ్ న్యూస్..పోస్టల్ డిపార్ట్మెంట్లో భారీ గా ఉద్యోగాలు..
పోస్టాఫీస్ లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్.. పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు.. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో 2024- 25 సంవత్సరానికిగానూ గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు సంబందించిన నోటిఫికేషన్ ను త్వరలోనే విడుదల చెయ్యనున్నట్లు తెలుస్తుంది..
అయితే గతేడాది జనవరిలో 40 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది.. దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పోస్టుల భర్తీని వాయిదా వేశారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వాలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పోస్టులను విడుదల చేసేందుకు ప్రభుత్వాలు నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు..
పది పాసైన వాళ్లు ఈ పోస్టులకు అర్హులు.. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులకు వయసు విషయానికొస్తే.. 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీల కు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగ అభ్యర్ధులకు పదేళ్ల వరకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.. ఈ పోస్టులకు ఎంపికైన వారు పలుపోస్టుల్లో ఉద్యోగాలు చెయ్యాల్సి ఉంటుంది.. అలాగే ఈ పోస్టులకు అప్లై చేసుకొనేవారికి రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. పోస్టును బట్టి రూ. 10 నుంచి 12 వేల వరకు మొదట్లో జీతం ఉంటుంది.. ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి.. ఈ పోస్టులకు అప్లై చేసుకొనేవాళ్లు నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు..