Trai: ఉచిత సిమ్ కార్డపై వేటు
Trai: ఉచిత సిమ్ కార్డపై వేటు
టెలికం కంపెనీల మధ్య ఉన్న పోటీ వల్ల ఇప్పటి వరకు సిమ్ కార్డులు ఉచితంగా అందించాయి. ప్రస్తుతం దేశంలో బిఎస్ఎన్ఎల్ మినహా మూడు ప్రయివేటు టెల్కోలు మాత్రమే మిగలడంతో టెలికం మార్కెట్పై గుత్తాధిపత్యం పెరిగింది. క్రమంగా చార్జీలు పెంచుతూ.. వినియోగదారులపై భారం మోపుతున్నాయి.
ఇదే క్రమంలో సిమ్ కార్డులను ఉచితంగా జారీ చేసిన కంపెనీలు.. ఇకపై కొత్త కనెక్షన్లకు ఛార్జీ వసూలు చేయనున్నాయి. ఇందుకోసం టెలికం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రతిపాదనలు సిద్ధం చేసిందని సమాచారం. ఫోన్ నంబర్కు, ల్యాండ్లైన్ నంబర్ కు ఛార్జీలు వసూలు చేయాలని యోచిస్తోందని రిపోర్టులు వస్తున్నాయి. సహజ వనరుల్లానే ఫోన్ నంబర్ కూడా చాలా విలువయ్యిందని ట్రాయ్ భావిస్తుందని ఓ ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ.. ఇంతకాలం ఈ విషయాన్ని ఎవరి ప్రయోజనం కోసం పట్టించుకోలేదో స్పష్టం చేయలేదు. తక్కువ వినియోగ నంబర్ల విషయంలో ఆయా కంపెనీలకు జరిమానా విధించాలని ట్రారు యోచిస్తోంది.