TS DSC: డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. ఎడిట్ ఆప్షన్ అవకాశం ఇచ్చిన విద్యాశాఖ..
TS DSC: డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. ఎడిట్ ఆప్షన్ అవకాశం ఇచ్చిన విద్యాశాఖ..
నిన్న టెట్ 2024 ఫలితాలు విడుదలైన నేపథ్యంలో డీఎస్సీ దరఖాస్తులను విద్యాశాఖ అప్రమత్తం చేసింది. టెట్ స్కోర్‌తో పాటు ఇతర వివరాలను ఎడిట్ చేసుకునేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించింది.
హైదరాబాద్, జూన్ 12 (పీపుల్స్ మోటివేషన్):-
నిన్న టెట్ 2024 ఫలితాలు విడుదలైన నేపథ్యంలో డీఎస్సీ దరఖాస్తులను విద్యాశాఖ అప్రమత్తం చేసింది. టెట్ స్కోర్‌తో పాటు ఇతర వివరాలను ఎడిట్ చేసుకునేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. టెట్-2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి డీఎస్సీ పరీక్షకు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.
టెట్ పేపర్ -1లో 57,725 (67.13%), పేపర్ -2లో 51,443 (34.18%) మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్1కు 85,996 మంది, పేపర్2 పరీక్షకు 1,50,491 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నిరుడు టెట్‌తో పోల్చితే ఉత్తీర్ణత శాతం పెరగడం విశేషం. పేపర్ -1లో ఏకంగా 30.24శాతం, పేపర్ -2లో 18.88శాతం ఉత్తీర్ణతశాతం పెరిగినట్టు అధికారులు వెల్లడించారు. కాగా, అర్హత సాధించని అభ్యర్థులకు ప్రభుత్వం ఉపశమనం ఇచ్చింది. టెట్ -24లో అర్హత సాధించని దరఖాస్తుదారులకు డిసెంబర్ టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కల్పించింది. టెట్-24లో అర్హత సాధించిన వారికి ఒకసారి డీఎస్సీ పరీక్షకు ఉచితంగా దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించింది. టెట్ మెమోలను https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు అధికారులు తెలిపారు.
టీచర్లు గట్టెక్కలేకపోయారు...
సర్కారు బడుల్లో టీచర్లుగా పనిచేస్తున్న పలువురు టీచర్లు టెట్ పరీక్షను గట్టెక్కలేకపోయారు. తొలిసారిగా రాష్ట్రంలో 33వేలకు మందికిపైగా టీచర్లు టెట్ రాశారు. వీరిలో 18వేల మంది (54%) మాత్రమే టెట్ క్వాలిఫై అయ్యారు. ఏకంగా 15వేల (46%) మంది టీచర్లు అర్హత సాధించకపోవడం గమనార్హం. సబ్జెక్టులవారీగా చూస్తే అత్యధికంగా పేపర్ -2 సోషల్‌లో 56 శాతం టీచర్లు, పేపర్ -2 గణితం, సైన్స్‌లో 49 శాతం, పేపర్ -1లో మరో 21శాతం టీచర్లు అర్హత సాధించలేదు. టీచర్లు టెట్‌లో క్వాలిఫై కాలేదు. టెట్ పరీక్షలను గత మే 20 నుంచి జూన్ 2 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎంవో కార్యదర్శి మాణిక్‌రాజ్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.