-Advertisement-

Whats app: వాట్సాప్ లో ఈ సింబల్ కనిపిస్తుందా.. అయితే అది ఇదే

WhatsApp Meta AI Meta AI WhatsApp Android pho WhatsApp Meta login WhatsApp Meta AI available countries Meta AI WhatsApp link Meta AI WhatsApp number
Pavani

Whats app: వాట్సాప్ లో ఈ సింబల్ కనిపిస్తుందా.. అయితే అది ఇదే

వాట్సాప్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

ఏ సమాచారం అడిగినా క్షణాల్లో వచ్చేస్తుంది..

WhatsApp: ప్రస్తుతం స్మార్ట్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటం సర్వసాధారణమైంది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం మొత్తం చేతిలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇకపోతే ప్రతి ఒక్క స్మార్ట్ఫోన్లలో కచ్చితంగా ఉండే యాప్స్ విషయానికి వస్తే.. మొదటి స్థానంలో వాట్సాప్ ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక మంది ఎక్కువగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్. అత్యధిక ఫీచర్లతో ఎప్పటికప్పుడు వాట్సాప్ వారి యూజర్ల కోసం అప్డేట్స్ తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి వాట్సాప్కు ప్రపంచవ్యాప్తంగా ఇంత క్రేజ్ ఉంది. కొత్తగా ఎన్ని రకాల మెసేజ్ యాప్స్ అందుబాటులోకి వస్తున్నా గాని.. వాట్సాప్ క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. దీనికి కారణం ఎప్పటికప్పుడు వాట్సాప్ కొత్త ఫీచర్ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురావడమే.

WhatsApp Meta AI Meta AI WhatsApp Android pho WhatsApp Meta login WhatsApp Meta AI available countries Meta AI WhatsApp link Meta AI WhatsApp number

ఇక తాజాగా వాట్సాప్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ప్రస్తుతం ఏఐ అద్భుతాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని రంగాల్లోనూ ఏఐని వినియోగిస్తున్నారు. సోషల్ మీడియా సంస్థలు కూడా ఏఐ టెక్నాలజీని వాడుతున్నాయి. దీనిలా భాగంగా మెటా కీలక ముందడుగు వేసింది. మెటా నేతృత్వంలో నడుస్తోన్న వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి వాటిలో ఏఐ సేవలను తీసుకొచ్చారు. ప్రస్తుతం భారత్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో చాలా మంది వాట్సాప్ యూజర్లు ఏఐ సేవలను ఉపయోగించడం మొదలు పెట్టారు. ఇంతకీ ఈ ఏఐ సేవలను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

వాట్సాప్ ఓపెన్ చేయగానే రౌండ్ షేప్లో ఉన్న ఒక ఐకాన్ కనిపిస్తోంది. ఆ సింబల్పై క్లిక్ చేయగానే మెటా ఏఐ పేరుతో చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు సమాచారం అడిగినా క్షణాల్లో వచ్చేస్తుంది. అయితే ఈ ఫీచర్ ఇప్పటికే కొంత మందికి టెస్టింగ్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన మెటా ప్రస్తుతం అందరు యూజర్లకు కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్ల మెరుగైన సాంకేతిక సౌకర్యాల కోసమే ఈఅధునాతన ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు మెటా వెల్లడించింది. మెటా తీసుకువచ్చిన ఈ ఏఐ ఫీచర్ సాయంతో వినియోగదారులు ఏదైనా సమాచారం తెలుసుకోవడానికి ప్రత్యేకంగా యాప్స్ను వినియోగించాల్సిన అవసరం లేదు. వాట్సాప్లోనే ఆ ప్రశ్నను అడిగి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఉదాహరణకు గూగుల్ సెర్చ్లో వెతికే ప్రతి అంశం వాట్సాప్లోనే చెక్ చేసుకోవచ్చు.

రెండు నెలలుగా వాట్సాప్ ఏఐ ఫీచర్ వస్తుంది అని మెటా కంపెనీ ప్రకటించింది. 2024 జూన్ 27వ తేదీ నుంచి వాట్సాప్ ఉన్న వారికి ఈ ఫీచర్ కనిపిస్తుంది. కొన్ని అంశాల్లో తప్పుడు సమాచారం చూపిస్తుందని నెటిజన్లు అంటున్నారు. ఇంగ్లీష్ వరకు బాగానే ఉన్నా.. తెలుగు భాషలో ప్రశ్నిస్తే తప్పులు వస్తున్నాయని కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Comments
Comment Poster
తెలుగు వర్షన్ కూడా త్వరగా update చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

-Advertisement-