క్యాస్ట్ వెరిఫికేషన్ 15 రోజులలో పూర్తి చేయాలి..
క్యాస్ట్ వెరిఫికేషన్ 15 మూ రోజులలో పూర్తి చేయాలి..
- మీసేవ రెవెన్యూ సర్వీసెస్ సమస్యలు గడువులోగా పరిష్కరించండి..
- తహశీల్దార్లు మరియు వి ఆర్ ఓ ల వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య..
కర్నూలు, జూలై 03 (పీపుల్స్ మోటివేషన్):-
వీఆర్వోలు క్యాస్ట్ వెరిఫికేషన్ చేసిన వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. తహశీల్దార్లు పరిశీలించి ఆమోదించాలని , అలాగే రెవెన్యూ సర్వీసెస్ సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య వీడియో కాన్ఫరెన్స్ సమావేశం లో సమీక్షించి ఆదేశించారు.
బుధవారం ఉదయం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య అన్ని మండల తహశీల్దార్లు మరియు వీఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ విఆర్ఓ లు ఏ విధంగా క్యాస్ట్ వెరిఫికేషన్ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు . వీరు చేస్తున్న వెరిఫికేషన్ ను ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారని తహశీల్దార్ల ను ప్రశ్నించి తెలుసుకున్నారు.
జాయింట్ కలెక్టర్ క్యాస్ట్ వెరిఫికేషన్ కు సంబందించి సూచనలు ఇస్తూ... మొదటగా మీ గ్రామ పరిధిలో కుల ధ్రువీకరణ పత్రాల కొరకు వచ్చిన అప్లికేషన్ లిస్టును తీసుకొని వారి అడ్రస్ ప్రకారము వారి ఇంటికి వెళ్లి వారి ఇంటిలో ఇంతకు మునుపు ఎవరైనా కుల ధ్రువీకరణ పత్రము పొంది ఉంటే దానిని సరిచూసుకొని , వారి అడ్రస్ ఆధార్ కార్డు ద్వారా ధ్రువీకరించుకొని , చుట్టుప్రక్కల నివాసముంటున్న వారిని విచారించి , గ్రామ తలారి నీ విచారించి , వారికి సంబందించిన ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ లను పరిశీలించి మరియు నవశకం ఆప్ లో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించుకొవాలని , ఆ విధంగా అన్ని పరిశీలనలు చేసి ఆన్ లైన్ లో పొందు పరచాలని ఆదేశించినారు. ప్రతిరోజు ఒక విఆర్ఓ దాదాపు 40 కాస్ట్ వెరిఫికేషన్లు చేయాలని ఆ విధంగా చేసి 15 రోజుల లోపల అన్ని వెరిఫికేషన్ లు పూర్తి చేయాలని , ఈ కార్యక్రమాన్ని నిశితంగా తహశీల్దార్లు పర్యవేక్షించాలని ఆదేశించినారు. ఈ కార్యక్రమంలో విఆర్వోలు అలసత్వం చేసిన యెడల కఠినంగా శిక్షించబడతారని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో 229685 క్యాస్ట్ వెరిఫికేషన్ కొరకు అప్లికేషన్లు రాగా 70604 పూర్తి అయినవని ఇంకా 159081 వెరిఫికేషన్లు జరగవలసి ఉన్నదని కావున ఏ విధంగా ఆలస్యం జరగకుండా వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఆదేశించినారు.
మీసేవ రెవెన్యూ సర్వీసులో భాగంగా ఫ్యామిలీ సర్టిఫికెట్లు , జనన , మరణ ధ్రువీకరణ పత్రాలు , మ్యూటేషన్ లు మొదలగునవి నిర్దేశిత గడువులోగా ప్రజలకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినారు.
మొబైల్ డిస్ట్రిబ్యూటింగ్ యూనిట్ వాహనాల ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీలో ఎటువంటి ఆలస్యము జరుగ రాదని , ఒకవేళ ఏదైనా కారణం చేత ఎండియు వాహనదారుడు రాకపోతే ఇతర వాహనదారులకు ఆ బాధ్యతలు వెంటనే అప్పజెప్పి నిత్యావసర సరుకు వితరణ వెంటనే జరిగే లాగా చర్యలు తీసుకోవాలని తహశీల్దార్లు ను ఆదేశించారు.
ఈ వీడియో సమీక్ష సమావేశం లో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భార్గవ తేజ , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిరంజీవి , పత్తికొండ ఆర్డిఓ రామలక్ష్మి , డిస్టిక్ సప్లై ఆఫీసర్ కే. వి ఎస్. ఎం. ప్రసాద్, ఎడి సర్వే , తహశీల్దార్లు పాల్గొన్నారు.