-Advertisement-

17 లక్ష సంవత్సరాల రామసేతు.

General News telugu Trending news telugu Intresting news Telugu daily news Current Affairs Quiz Current Affairs pdf Breaking news telugu Political New
Peoples Motivation

17 లక్ష సంవత్సరాల రామసేతు

చెన్నై, జూలై 16 (పీపుల్స్ మోటివేషన్):

భారత్ శ్రీలంక మధ్య రామేసేతు వంతెన కాల్పనికం కాదని.. నిజంగానే ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిర్ధారించింది. ఈమేరకు ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఉపగ్రహం సహాయంతో తమిళనాడు వంతెనకు సంబంధించిన మ్యాప్ విడుదల చేశారు. భారత్ శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కిలోఈటర్లు ఉంది. దీని ఎత్తు సముద్రగర్భం నుంచి 8 మీటర్లు ఉన్నట్లు నిర్ధారించారు. 

General News telugu Trending news telugu Intresting news Telugu daily news Current Affairs Quiz Current Affairs pdf Breaking news telugu Political New

ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోటి నుంచి శ్రీలంక వరకు ఉందని తెలిపారు. దీప్వపంలోని తలైమన్నార్ వాయవ్య దిశ వరకు విస్తరించి ఉందని పేర్కొన్నారు. దీనిని సున్నపురాతితో నిర్మించినట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ సేతువు 99.98 శాతం నీటిలో మునిగిందని శాస్త్రవేత్తలు ప్రనకటించారు. దేవుడు, రాముడు, రామాయణం వంటి అంశాలపై దేశంలో ఇప్పటికీ ఆస్తికులు, నాస్తికుల మధ్య చర్చ జరుగుతూనే ఉంది. ఇలాంటి అంశాలలో ఒకటి రామసేతు. ఇది స్వయంగా రాముడే నిర్మించాడని కొందరు చెబుతుంటే కాదు సముద్రంలో సహజ సిద్ధంగానే ఏర్పడిందని మరికొందరు వాదిస్తున్నారు. అయితే భారత్లో ఈ వంతెనను రామసేతు అని పిలుస్తుండగా, శ్రీలంకలో అడాంగ పాలం అని పిలుస్తారు. దీనినే ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. దీని ఆధారంగానే గతంలో రామసేతు సినిమా తెరకెక్కించారు. ఇక రామసేతు వయసు 17 లక్షల ఏళ్లు ఉంటుందని అంచనా. రావణుడు సీతను అపహరించడంతో ఆమెను రక్షించడానికి రాముడు లంకకు వెళ్లే క్రమంలో తన వానర సైన్యంతో కలిసి రాళ్లతో ఈ వంతెనను నిర్మించాడనేది చాలామంది విశ్వాసం. సుమారు 30 మైళ్ల పొడవైన ఈ వంతెన ఎలా. నిర్మితమైంది అన్నది మాత్రం ఇప్పుటికీ అంతుచిక్కని ప్రశ్నే.. అయితే దీనిపై తాజాగా ఇస్రో శాస్త్రవేత్తలు క్లారిటీ ఇచ్చారు. ఇది నిర్మించినదే అని తేల్చారు. సహజ సిద్ధంగా ఏర్పడలేదని ప్రకటించారు. ఇదిలా ఉంటే వంతెన కోసం వాడిన రాళ్ల రహస్యంపనా అనేక పరిశోధనలు జరిగాయి. పగడపు, సిలికా రాళ్లు వేడెక్కినపుడు వాటిలోకి గాలి చేరి అవి తేలికగా మారి నీటి పై తేలుతాయని, అలాంటి రాళ్లతోనే ఈ వారధి నిర్మించాలరి కొందరు పేర్కొంటున్నాడు. సహజంగానే ఏర్పడి ఉండొచ్చనేది కొందరు

శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇక ఈవంతెన ప్రాంతంలో సముద్రంలో ఆటుపోట్లు అత్యంత తీవ్రంగా ఉంటాయి. ఇక 2004 వచ్చిన సునామీని కూడా రామసేతు తట్టుకుని నిలబడింది. అయితే కొన్ని రాళ్లు రామేశ్వరం ప్రాంతంలో కనిపించాయట. ఇప్పటికీ ఆ ప్రాంతంలో నీటిపై తేలే రాళ్లు కనిపిస్తాయి. వాటిని చూడటానికి చాలా మంది రామేశ్వరం వెళతుంటారు. ఇదిలా ఉంటే.. రామసేతు నిర్మాణంపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా క ఊడా పరిశోధనలు చేసింది. శాటిలైట్ల ద్వారా తీసిన ఛాయాచిత్రాల్లో 30 మైళ్ల పొడవున రాళ్లు పేర్చి ఉన్నట్లుగా కనిపిస్తుందని ప్రకటించింది. ఇది మానవ నిర్మితం అని మాత్రం వాసా ఎప్పుడూ ధ్రువీకరించలేదు. ఇక 2017 డిసెంబర్లో అమెరికాకు చెందిన సైన్స్ ఛానెల్ % 30 మైళ్లకు పైగా పొడవున్న రామసేతు మానవ నిర్మితమని ప్రకటించడం ద్వారా మరోసారి చర్చకు తెరలేపింది. ఇక రామసేతు సహజ సిద్ధంగా ఏర్పడినట్లు లేదని, అక్కడి ఇసుక సహజంగా ఉన్నదే అయినా దానిపై పేర్చిన రాళ్లు మాత్రం వేరే చోటు నుంచి తీసుకొచ్చి పేర్చినట్టుగా ఉన్నాయని పురాతత్వ శాఖకు చెందిన డాక్టర్ అలెన్ లెస్టర్ తెలిపారు. ఈ ఇసుక 4వేల ఏళ్ల నాటిదని, రాళ్లు 7 వేల ఏళ్ల నాటివని పరిశోధన. లో తేలిందని చెప్పారు. ఇదిలా ఉంటే.. రామసేతు రాజకీయంగా కూడా కొన్నేళ్లు బాగా రగిలిన అంశమే. 2005లో యూపీఏ ప్రభుత్వం సేతు సముద్రం షిప్ కెనాల్ ప్రాజెక్టులో భాగంగా 12 మీటర్లలోతు, 300 మీటర్ల వెడల్పు ఉన్న కాలుపను తప్పేందుకు అనుమతి ఇచ్చింది. గల్ఫ్ ఆఫ్ మున్నార్ను లోతుగా తవ్వి నౌకల రాకపోకలు సాగించేలా మార్చాలని గతంలో యూపీఏ సర్కారు భావించింది. ఈ ప్రాజెక్టు ద్వారా అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య ప్రయాణించడానికి ఓ మార్గం ఏర్పడుతుంది. ప్రాజెక్టు పూర్తయితే శ్రీలంక చట్టూ తిరిగే అవసరం ఉండదు. ప్రయాణ సమయం, ధనం రెండూ ఆదా అవుతాయని అంచనా వేశారు. అయితే ఈ మార్గం ఏర్పడాలంటే రామసేతును బద్దలు కొట్టాల్సి వస్తుండడంతో హిందూ సంస్థలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకించాయి. భారత్, శ్రీలంకకు చెందిన పర్యావరణ వేత్తలు ఈ ప్రాజెక్టు చేపడితే సముద్ర పర్యావరణం దెబ్బ తింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

-Advertisement-