ACB: రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎమ్మార్వో..!
ACB: రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎమ్మార్వో..!
వనపర్తి, (పీపుల్స్ మోటివేషన్):-
వనపర్తి జిల్లాలోని గోపాలపేట మండలం జింకల బీడు తాండాలో వ్యవసాయ పొలాన్ని నాలా కన్వర్షన్ కోసం రైతు వద్ద నుంచి లంచం తీసుకున్న తహసీల్దార్‌ను రెడ్‌హ్యండెడ్‌గా ఏసీబీ అధికారులు (ACB Raid ) పట్టుకున్నారు. వనపర్తి జిల్లాలోని గోపాలపేట మండలం జింకల బీడు తాండాకు చెందిన మూడవ పాండు అనే వ్యక్తి దగ్గర బుధవారం సాయంత్రం రూ. 8 వేలు లంచం తీసుకుంటూ తహసీల్దార్ ఎస్. శ్రీనివాసులు ( Tahsildar Srinivasulu) ను ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు. మూడవ పాండు అనే రైతు తన భార్య పేరున ఉన్న వ్యవసాయ పొలాన్ని నాలా కన్వర్షన్ (Nala Conversion) కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో తహసీల్దార్ లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం తహసీల్ కార్యాలయంలో నేరుగా బాధితుడు లంచం ఇస్తుండగా ముందస్తుగా పథకం ప్రకారం వల పన్నిన అధికారులు శ్రీనివాసులను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు.