Adhiraj Singh Rana IPS: గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తాం...
Adhiraj Singh Rana IPS: గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తాం...
నంద్యాల జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అదిరాజ్ సింగ్ రాణా I.P.S.
- నంద్యాల జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తాం...
- స్త్రీ, శిశు రక్షణకు పెద్ద పీట వేస్తాం
- పోలీసు సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట.....
- పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం..
- జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా I.P.S.
నంద్యాల, జులై 15 (పీపుల్స్ మోటివేషన్):-
ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ నందు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (L&O) గా విధులు నిర్వహిస్తూ సాధారణ బదిలీల్లో భాగంగా నంద్యాల జిల్లా ఎస్పీగా బదిలీ కావడం జరిగింది. ఈ సందర్భంగా నేడు నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది.
👉నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా IPS 2018 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ అధికారి.
👉హైదరాబాద్ నందు ఐపీఎస్ ట్రైన్ తర్వాత అనంతపురం జిల్లా ట్రైనీ ఐపీఎస్ గా విధులు నిర్వహించడం జరిగింది.
👉 అనంతరం గ్రేహౌండ్స్ నందు అసాల్ట్ కమాండర్ గా, అసిస్టెంట్ ఎస్పీగా రంపచోడవరం నందు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు ,యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రజలను నక్సల్స్ వైపు ప్రభావితం కాకుండా సరైన మార్గంలో నడిపిస్తూ అనతి కాలంలోనే వారి మన్నలను పొందారు.
👉నర్సీపట్నం నందు అసిస్టెంట్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించి నేరా నియంత్రణలో తనదైన శైలిలో గంజాయి, అక్రమ రవాణా, వివిధ రకాల నేరస్తులపై ఉక్కుపాదం మోపి శాంతి భద్రతల పరిరక్షణలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
👉ఈ సందర్భంగా మీడియాతో జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా IPS మాట్లాడుతూ ముఖ్యమంత్రి మరియు డిజిపి నాపై నమ్మకం ఉంచి నాకు అప్పగించిన బాధ్యతలను 100% సమర్థవంతంగా నిర్వహించి జిల్లా ప్రజలకు పోలీసు శాఖకు మంచి పేరు తెచ్చేలా పనిచేస్తానని ,మహిళలపై జరిగే నేరాల నిర్మూలన, మహిళా సమస్యల పరిష్కారానికి అధికప్రాధాన్యతను ఇస్తూ శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ తదితర సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటానని,ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా ప్రజల సహకారంతో వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ద్యేయంగా పనిచేయడం జరుగుతుందని మరియు పోలీసులు వారి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి ఉంచడం జరుగుతుందని , పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.ఇందుకు మీడియా సహకారం అందించాలని తెలియజేశారు.