AP TET: ఏపీ టెట్ సిలబస్ పై అది అవాస్తవం.. విద్యాశాఖ క్లారిటీ
AP TET: ఏపీ టెట్ సిలబస్ పై అది అవాస్తవం.. విద్యాశాఖ క్లారిటీ.
ఏపీలో కొత్తగా నిర్వహించనున్న టెట్ పరీక్షకు పాత సిలబస్ ఉంచారంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ప్రచారం అవాస్తవమని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ స్పష్టంచేశారు.
అమరావతి: ఏపీలో టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ కంటే ముందుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2024) నోటిఫికేషన్ ను విద్యాశాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులిటెన్, షెడ్యూల్, సిల బస్తదితర వివరాలు ఇప్పటికే వెబ్సైట్లోఅం దుబాటులో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ వెల్లడించారు.
అయితే, టెట్ (జులై) పరీక్షకు పాత సిలబస్ ఉంచినట్లుగా సోషల్మీడియాలో ప్రచారం జరుగుతోందని, ఇది వాస్తవం కాదన్నారు.
దీనిపై అభ్యర్థులు ఎలాంటి అపోహలకు
గురికావొద్దని సూచించారు. ఈ ఏడాదిఫి బ్రవరిలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు నిర్ణయించిన సిలబస్ని ప్రస్తుత టెటు కూడా నిర్థారించినట్లు తెలిపారు. అందు వల్లదాన్నే వెబ్సైట్లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ సిలబస్ ఆధారంగానే అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధం కావాలని సూచిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.