-Advertisement-

AP Govt: నిధులు లేని కారణంగా.. జీతం తీసుకోవడం లేదు: పవన్ కళ్యాణ్

Telugu daily political updates intresting news daily telugu news breaking news breaking news Telugu daily political updates latest crime news Telugu..
Priya

AP Govt: నిధులు లేని కారణంగా.. జీతం తీసుకోవడం లేదు: పవన్ కళ్యాణ్

కాకినాడ జిల్లా గొల్లప్రోలులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన..

4 పెంచన్లను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పవన్..

ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటిసారి పిఠాపురానికి పవన్..

కీలకమైన శాఖలు తీసుకున్నాను.. మంత్రిత్వ శాఖల పట్ల అవగాహన కలిగించుకుని ప్రజలకు మేలు చేస్తా..

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అది కూడా డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి తన నియోజకవర్గంలో అడుగుపెట్టారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వస్తూ వస్తూనే ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా పనిలో దిగిపోయారు.. ఇక, రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాగా.. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పెంచన్లను పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ క్రింద వృద్ధులకు 7000 రూపాయలు, వికలాంగులకు 6000 రూపాయలు పంపిణీ చేశారు.. అయితే, దివ్యాంగులకు నాలుగు శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.. దివ్యాంగుల పెన్షన్. 3000 నుండి 6000 రూపాయలకు పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు..

Telugu daily political updates intresting news daily telugu news breaking news breaking news Telugu daily political updates latest crime news Telugu..

ఇక, ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటిసారి వచ్చా పిఠాపురానికి వచ్చారు.. గెలిచిన వెంటనే. పనిలోకి దిగాను అని తెలిపారు.. విజయోత్సవ సభలతో సమయం వృధా చేసుకోవడం ఇష్టం లేదు.. కీలకమైన శాఖలు తీసుకున్నాను.. మంత్రిత్వ శాఖల పట్ల అవగాహన కలిగించుకుని ప్రజలకు మేలు చేయాలని ఆలోచన చేస్తున్నాను అన్నారు.. కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్ రావని ప్రచారం చేస్తే గుర్తింపు చేసి అందజేస్తున్నాం.. వైసీపీ లాగా కాకుండా.. సంక్షేమం, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం అన్నారు.. వైసీపీ పాలనలో ప్యాలెస్ నిర్మాణానికే ప్రాధాన్యత ఇచ్చారు అంటూ ఎద్దేవా చేశారు.. పంచాయతీరాజ్ శాఖలో మంత్రిగా జీతం తీసుకోవాలని అనుకున్న.. కానీ, ఈ శాఖలో జరిగిన అవినీతి కారణంగా రూపాయి నిధులు కూడా లేవు.. అందుకే నా జీతం కూడా వదిలేశాను అన్నారు.. ఇక, లబ్ధిదారులకు అందజేస్తున్నా సంక్షేమ పథకాలను రీ సర్వే చేపడతాం.. ప్రజలకు పని చేసి మన్ననలు పొందిన తరువాతే విజయోత్సవం చేసుకుంటాను.. పిఠాపురం నియోజకవర్గంలోని మోడల్ విలేజ్ లుగా చేస్తా.. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా పరిపాలనను ముఖ్యమంత్రి చంద్రబాబు గాడిలో పెడతా.. రాజకీయాలకు డబ్బులకు సంబంధంలేదు.. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే. పనులు అన్ని చిటికెలో చేస్తారని కోరుకుంటారు. చిటికెలో పని జరిగేలా కృషి చేస్తాను.. వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 వేలు. పెన్షన్ ఇచ్చి 300 కమీషన్ తీసుకునే వారు.. ఇలా జరగకుండా కూటమి ప్రభుత్వం చూస్తుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

Comments

-Advertisement-