జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం..ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి
జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం..ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి
పిఠాపురం, జూలై 18 (పీపుల్స్ మోటివేషన్):-
జనసేన పార్టీ ఈ నెల 18 నుంచి క్రీయాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించాలని అధినేత పవన్ కల్యాణ్ ఆదేశించారు. వీటిని ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకొని విజయవంతం చేయాలని సీనియర్ జనసేన పార్టీ నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలైందని పిఠాపురం నియోజవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రి రెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం నుండి క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయడం జరుగుతుందని వెంకటేశ్వర రావు అన్నారు.
జనసేన పార్టీఅధినేత ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని మండలాలకు సమాచారం అందించారుని.ఇప్పటికే జిల్లాల నియోజకవర్గాల ఇన్‌చార్జులు, వలంటీర్లకు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన లాగిన్‌లు అందించారుఅని.గురువారం నుంచి గ్రామ, వార్డు, మండల స్థాయిల్లో సభ్యత్వ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసుకోనున్నారు అని గత ఏడాది దాదాపు ఆరున్నర లక్షల మంది జనసేన పార్టీ క్రీయాశీలక సభ్యులుగా చేరారు. ఈ ఏడాది పది లక్షల మందికి పార్టీ సభ్యత్వం కల్పించాలని పార్టీ నిర్ణయించిందిని తెలగంశెట్టి తెలిపారు.
క్రియాశీలక సభ్యత్వం పొందే ప్రతి ఒక్కరికీ ప్రమాద, జీవిత బీమా కూడా అందించనున్నారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో... కొత్త సభ్యులను చేర్చుకోవడంతో పాటు, పాత సభ్యత్వాల రెన్యువల్ కూడా చేపట్టనున్నారు.
జులై 18 నుంచి 28 వరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగనుందిఅని 5లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలగంశెట్టి తెలిపారు.