టేస్టింగ్ సాల్ట్.. ప్రాణాలకు ముప్పు...?
టేస్టింగ్ సాల్ట్.. ప్రాణాలకు ముప్పు...?
- ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు/హోటల్లు..
- కానరాని ఫుడ్ ఇన్స్పెక్టర్ల ఆచూకీ!
- కలెక్షన్లు ఫుల్ .... అందుకే తనికీలు నిల్..!
- టేస్టు అని తింటే .... ఆరోగ్యం బ్లాస్ట్!
(పీపుల్స్ మోటివేషన్ డెస్క్):-
ఈ మధ్యకాలంలో చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇమ్మడి ముమ్మడిగా రోడ్డు పక్కన వెలుస్తున్నాయి. శుచిగా లేకపోయినా రుచి కోసం అంటూ జనాలు క్యూ కడుతున్నారు. ఫైవ్ స్టార్ హెూటల్స్ ఏమీ తక్కువేమీ కాదు.. అలాగే వేడి. వేడిగా.. గుబాలాలించే వాసనలతో ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఆహారానికి రుచికరం ఆకట్టుకోవాలని ఆహార ప్రియులకు ఆహ్లాదకరంగా రుచిగా నోటికి అందించేందుకు మితిమీరిన టేస్టింగ్ సాల్డ్ జత చేసి వడ్డిస్తున్నారు.. చిన్న పిల్లలు నుండి పెద్ద వాళ్ళ వరకు తినడం వల్ల తినేవారికి తెలియకనే మెల్ల మెల్లగా మంచం బారిన పడుతూ... ఎన్నో రుగ్మతలకు గురువుతున్నారు. అంతేకాకుండా చిన్న వయసులోనే యువత గుండె జబ్బులు బారిన పడిన సందర్భాలను చూస్తున్నాము.. వీటన్నిటికీ కారణం.. ఈ రుచికరమైన ఉప్పు, మన దేశంలో తమిళనాడు లోనే కాక కొన్ని దేశాల్లో టేస్టింగ్ సాల్ట్ ఉప్పును పూర్తిగా నిషేధించినప్పటికీ కూడా కొన్ని దేశాలలో వినియోగించిన వారిపై కఠిణతరమైన శిక్షలను విధిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వీటి వినియోగం తగ్గినప్పటికీ, వ్యాపారభివృద్ది కోసం దొంగ చాటుగా వ్యాపారస్తులు వీటిని వినియోగించడం విశేషం! కరోనా తర్వాత భారీగాపెరిగిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లు. వాళ్లు వడ్డించే వంటకాలు రుచిగా ఉండటానికి టేస్టింగ్ సాల్ట్ వాడుతుంటారు. అయితే బయట హోటల్స్, రెస్టారెంట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో దీని వాడకం ఎక్కువగా ఉంటుంది.. చిన్నపిల్లలు ఇష్టంగా తినే నూడిల్స్, పొటాటో చిప్స్, ఫ్రైడ్ చికెన్ వంటి వంటకాలలో వీటి వాడకం మరి ఎక్కువుగా ఉంటుంది . నగరాలలోనే గాక గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నాగరికత పరిగటంతో గిరాకీ బాగా పెరిగిపోయింది. గ్రామీణ ప్రాంతాలకు పర్యవేక్షణ కష్టతరమే అనుకున్నా.... నగరంలో వీధి వీధికి పెరిగిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ పై ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ప్రత్యేక దాడులు జరిపి వీటిని అరికట్టకపోతే జనాలు రోగాల బారనపడి భారీ గానే నష్ట పోతూ .. దీర్ఘ కాలిక అనారోగ్య పరిస్థితులను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. పెరిగిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లు వాళ్లు వడ్డించే వంటకాలు రుచిగా ఉండటానికి మోతాదును మించి టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నట్లు ఆరోపణలూ ఉన్నాయి.
అసలు ఏంటి ఈ టేస్టింగ్ సాల్ట్..?
టేస్టింగ్ సాల్ట్ సాధారణ పేరు మోనోసోడియం గ్లుటామెట్, వంటకాల్లో వాడే టెస్టింగ్ సాల్ట్ ను అజినోమోటో కూడా పిలుస్తారు. అజినోమోటో వాడకం వల్ల శరీర నాడీ వ్యవస్థ బలహీన పడుతుంది.. వైద్య నిపుణుల అభిప్రాయాల ప్రకారం, ప్రాథమికంగా రసాయన పదార్థం అయిన టేస్టింగ్ సాల్ట్ కలిపిన ఆహార పదార్థాలను రోజు తీసుకోవడం వల్ల పార్కిన్సన్స్ మరియు వయోవృద్ధులకు రావలసిన ఆల్జీమర్స్ వంటి వ్యాధులు రావచ్చని, ఈ రుచికరమైన ఉప్పును ఆహార పదార్థాలతో కలిపి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మొదట వాంతులు, తలనొప్పి, అలసట, ఛాతీపై ఒత్తిడి మరియు గొంతులో, అర చేతుల్లో, అరికాళ్ళలో మంటలు కూడా వస్తాయని వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికైనా జాగ్రత్త పడండి...ఇప్పటికైనా ప్రజలారా..! ఆస్తిని మించిన ఆస్తి ఆరోగ్యం అని గుర్తు చేసుకోండి..✍️