-Advertisement-

భార్యను చూడడానికి ఏకంగా బస్సునే ఎత్తుకొచ్చిన ఘనుడు

General News telugu Daily News Telugu Telugu intresting news Intresting news Daily news updates Govt Jobs news Current Affairs telugu Health tips
Peoples Motivation

భార్యను చూడడానికి ఏకంగా బస్సునే ఎత్తుకొచ్చిన ఘనుడు

General News telugu Daily News Telugu Telugu intresting news Intresting news Daily news updates Govt Jobs news Current Affairs telugu Health tips

ఆత్మకూరు, జులై 27 (పీపుల్స్ మోటివేషన్):-

భార్యను చూడడానికి ఏకంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సునే తెచ్చాడు ఓ ఘనుడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన దర్గయ్య అనే వ్యక్తికి ముచ్చుమరి గ్రామానికి చెందిన మహిళతో వివాహమైంది. అయితే వృత్తిరీత్యా దర్గయ్య లారీ డ్రైవర్ ఆయన వీధులకు వెళ్లగా గత కొన్ని రోజులుగా భార్య పుట్టినిల్లు ముచ్చుమరి కి వెళ్ళింది.

అయితే ఇంటికి వచ్చిన దర్గయ్య భార్య లేదని శుక్రవారం ఆత్మకూరు డిపోలో ఆగి ఉన్న బస్సును తీసుకొని భార్య ముచ్చుమరి గ్రామానికి వెళ్ళాడు.

అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ముచ్చుమరిలో బస్సును ఆపి అతని  అదుపులోకి తీసుకొని విచారించగా నా భార్య ఇదే గ్రామంలో ఉంది అని భార్యను చూడడానికి ఏమీ లేకపోవడంతో  తెల్లవారుజామున ఆత్మకూరు బస్టాండ్ లో బస్సు నిలిచి ఉండడంతో బస్సు కే తాళాలు ఉండడంతో బస్సును తెచ్చుకున్నానని  సమాధానం ఇచ్చాడు. అనంతరం ఈ విషయంపై పోలీసులు కుటుంబ సభ్యులను బంధువులను అడగగా అయితే అతనికి మతిస్థిమితం సరిగ్గా లేదని వారు తెలిపారు.

Comments

-Advertisement-