ఎవరికీ భయపడవద్దు మీకు నేనున్నా - బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
ఎవరికీ భయపడవద్దు మీకు నేనున్నా - బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
నందికొట్కూరు మున్సిపాలిటీలో వైసిపికి భారీ షాక్..
మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు మరో 18 మంది కౌన్సిలర్లు, ఇద్దరు కో -అప్సన్ సభ్యులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టిడిపిలో చేరిక..
బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గం నుంచి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వర్గంలో చేరిక..
మున్సిపాలిటీ టిడిపి హస్తగతం..
ఎవరి బెదిరింపులకు భయపడవద్దు , అందరం కలిసికట్టుగా పేదల అభ్యున్నతికి పనిచేద్దాం, నేను మీకు అందగా ఉంటా అంటూ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
శుక్రవారం నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి ఇంటిలో నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి తో పాటు 18 మంది వైసీపీ కౌన్సిలర్లు, ఇద్దరు కో - అప్సన్ సభ్యులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో వైసీపీని, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గం వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఈ సందర్బంగా బైరెడ్డి మాట్లాడుతూ వైసీపీని వీడి టీడీపీలో చేరిన మున్సిపల్ చైర్మన్ తో పాటు 18 మంది కౌన్సిలర్లు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, తాను మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అందరం కలిసికట్టుగా పేదరిక నిర్ములనకు కృషి చేద్దామని, నందికొట్కూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదామన్నారు. చుట్టూ ప్రక్కన గ్రామాల ప్రజలు బిడ్డల చదువులకోసం, వ్యాపారాల కోసం, జీవనోపాధి కోసం నందికొట్కూరుకు రావడంతో జనాభా పెరిగిందని, జనాభా పెరుగుదలకు అనుగుణంగా మున్సిపాలిటీలో వసతులు కూడా పెరగాల్చిన అవసరం ఉందని బైరెడ్డి వివరించారు.
తాను రెండు సార్లు నందికొట్కూరు ఎమ్మెల్యేగా పనిచేయడం, ఆ సమయంలో తాను నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్దే నేటికీ మీ ముందు కనపడుతుందని, మా కుటుంబం కూడా రాజకీయంగా మీ ముందు ఉన్నామంటే తాను చేసిన అభివృద్ధి కారణం అని గుర్తు చేసుకున్నారు.
నంద్యాల MP గా తన కూతురు Dr. బైరెడ్డి శబరి విజయం సాధించేందుకు అందరూ కృషి చేశారని, MP శబరి ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుతో నిధులు ఎక్కువ సాధించి నందికొట్కూరు నియోజకవర్గం, మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేద్దాం అని బైరెడ్డి అన్నారు.
నందికొట్కూరు మునిసిపల్ చైర్మన్ డి. సుధాకర్ రెడ్డి తో పాటు వైసీపీ కౌన్సిలర్లు ప్రశాంతి, చిన్నరాజు, కృష్ణ, జయమ్మ, షేక్ నాయబ్, కరిష్మా, సి. లక్ష్మిదేవి, రూపాదేవి, విజయలక్ష్మి, ప్రసాద్, శాంతకుమారి, కృష్ణవేణి, అబ్దుల్ రవూప్, ఎం. లక్ష్మిదేవి, సురేష్, చాంద్ బాషా, సమీరాబాను, రాధిక, గఫార్, సుశీల భాగ్యమ్మలు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు, వీరికి టీడీపీ కండువాలు వేసి టీడీపీలోకి ఆహ్వానించి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని బైరెడ్డి హామీ ఇచ్చారు.