మండల ప్రజా పరిషత్తు సర్వసభ్య సమావేశం..ఇంటికే పరిమితమైన మహిళ ప్రజా ప్రతినిధులు
మండల ప్రజా పరిషత్తు సర్వసభ్య సమావేశం..ఇంటికే పరిమితమైన మహిళ ప్రజా ప్రతినిధులు
యు.కొత్తపల్లి/పిఠాపురం, జూలై 10 (పీపుల్స్ మోటివేషన్):-
మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం రసా బాసగా సాగింది. ఎంపీపీ కారే సుధా వ్యక్తిగత కారణాల వల్ల సమావేశానికి హాజరు కాకపోవడంతో వైస్ ఎంపీపీ లు చెట్టు బత్తిన సురేష్ కుమార్ ( నాని), మాదిరెడ్డి దొరబాబు ల అధ్యక్షత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కొంతమంది మహిళ సర్పంచులు, ఎంపీటీసీలు రావాల్సి ఉన్న భర్తలు కొడుకులు, తండ్రి హాజరయ్యారు. మహిళలను రాజకీయంగా రాణించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పించి ఎన్నికల్లో పోటీ చేసే విధంగా అవకాశం కల్పిస్తున్న గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం గెలుపొందిన మహిళ సర్పంచులు, ఎంపీటీసీలను ఇంటికే పరిమితం చేసి సమావేశాలకు భర్తలు హాజరై అధికారులను సమస్యలపై నిలదీయడంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన వారికి సర్వసభ్య సమావేశంలోసమాధానం చెప్పాలా లేక భర్తలకు సమాధానం చెప్పాలో తెలియడం లేదని అధికారులు ఒకరికి ఒకరు గుసగుసలాడుకున్నారు. వచ్చే సమావేశానికి ప్రోటోకాల్ ప్రకారమే సర్వసభ్య సమావేశం జరుగుతుందని ఎంపీడీవో వెంకటనారాయణ తెలిపారు. సమావేశంలో ప్రజా ప్రతినిధులు కొంతమంది అధికారులను గ్రామాల్లో జరుగుతున్న సమస్యలపై మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడేటప్పుడు సమావేశం గందర గోళంతో ముగించారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు, జడ్పిటిసి తులసి కుమార్ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.