GIRLS EDUCATION: బాలికల విద్యాను ప్రోత్సాహించండి.
బాలికల విద్యాను ప్రోత్సాహించండి.
ప్రభుత్వ విద్యాసంస్థలు గురుకుల,కేజీబీవీ,ఆదర్శ పాఠశాలల్లో సీట్లు పెంచాలి..
మండల కేంద్రంలో బీసీ బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలి..
ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.శరత్ కుమార్.
దేవనకొండ, జులై 01 (పీపుల్స్ మోటివేషన్):-
ప్రభుత్వ విద్యాసంస్థలైన గురుకుల, కేజీబీవీ,ఆదర్శ పాఠశాలల్లో సీట్లు పెంచాలని,మండల కేంద్రంలో బీసీ బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.శరత్ కుమార్ కోరారు.సోమవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి,అనంతరం మండల తహశీల్దార్ ఈశ్వరయ్య శెట్టి కి వినతిపత్రాన్ని అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోనే కరువు,కాటకాలతో సతమతమవుతున్న కర్నూలు జిల్లా అత్యంత వెనకబడిన ప్రాంతమని అన్నారు.రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఉందని, ఉపాధి లభించక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని అన్నారు.ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళే సందర్భంలో వారి పిల్లలను ఇంటి దగ్గరే వదిలి వెళ్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్న,ఉండేందుకు వసతి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రైవేట్ విద్యాసంస్థలల్లో చదివించే స్తోమత లేక,తల్లిదండ్రులతో పాటు పిల్లలను ఉపాధి కి తీసుకెళ్తే,పిల్లలు కూడా బాలకార్మికులుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.జిల్లాలో ఇప్పటికే విద్యాప్రమాణ స్థాయిలు తగ్గిపోయాయని,నిరక్షరాస్యత ఎక్కువగా ఉందని అన్నారు.నిరక్షరాస్యత తగ్గించేందుకు నూతన విద్యాసంస్థలు ఏర్పాటుకు చర్యలు తీసుకోకుండా ఉన్న విద్యాసంస్థలను,వసతి గృహాలను మూసివేయడం జరుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేజీబీవీ పాఠశాల యొక్కగదులు నిధులు లేక నిర్మాణం పూర్తి అవ్వకుండా,మధ్యలోనే ఆగిపోయిందని అన్నారు.కావున జిల్లా అధికారులు స్పందించి ప్రభుత్వ విద్యాసంస్థలైన గురుకుల,కేజీబీవీ,ఆదర్శ పాఠశాలల్లో సీట్లు పెంచి,బాల,బాలికల విద్యాను ప్రోత్సాహించాలని,అదేవిధంగా మండల కేంద్రంలో ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని,కేజీబీవీ పాఠశాల గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి, పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో విద్యార్థులు, తల్లిదండ్రులను కలుపుకొని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్ష,కార్యదర్శులు మధు,భాస్కర్, నాయకులు శశి,మహేష్,రాము,విద్యార్థినీలు తదితరులు ఉన్నారు.