బీచ్ రోడ్డుకు మోక్షం ఎప్పుడు ???
బీచ్ రోడ్డుకు మోక్షం ఎప్పుడు ???
- రోడ్డు నిండా గుంతలే గుంతలు..
- బీచ్ రోడ్డు రహదారి ప్రాణాంతకం..
- భయం బ్రాంతులు చెందుతున్న ప్రయాణికులు..
- నిద్రమత్తులో ఆర్ అండ్ బి అధికారులు..
యు.కొత్తపల్లి/ పిఠాపురం, జులై 08 (పీపుల్స్ మోటివేషన్):-
కాకినాడ నుండి తుని వెళ్లే బీచ్ రోడ్ పరిస్థితి అద్వానంగా తయారయింది ప్రయాణికులు బీచ్ రోడ్ నుంచి వెళ్లాలంటే భయంభ్రాంతులు చెందుతున్నారు.
నేమం నుండి ఉప్పాడ బీచ్ రోడ్ అడుక్కో గుంతల తయారైంది రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద గోతులు తో దర్శనం ఇస్తుంది. గత ప్రభుత్వంలో ఈ బీచ్ రోడ్ ను గాలికి వదిలేసింది ఎన్నోసార్లు పత్రికలో కథనాలు రాసినప్పటికీ ప్రభుత్వం మరియు ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోలేదు! “ఈ రోడ్డు మార్గంలో రావాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని రావాల్సిందే ఎందుకంటే ఎన్నోసార్లు ప్రమాదాలు జరిగాయి ఇక్కడ ఆదమరిస్తే అంతే సంగతులు!! రోడ్డుకు అటు ఇటు పెద్ద పెద్ద గోతులు కనబడుతుంటాయి. చీకటి పడుతుందంటే ఈ బీచ్ రోడ్డు నుండి రావాలంటే ఓ పక్క సముద్ర కెరటాలు మరోపక్క గోతులు కొత్తవారు రావడానికి సాహసించరు. తుఫాన్లు వచ్చినప్పుడు కెరటాలు తాకిడికి రాళ్లు రోడ్డు మధ్యలోకి రావడం వాటిని ఆర్ అండ్ బి అధికారులు తొలగించడం సంగతి మీ అందరికీ తెలిసినదే. గతంలో ఈ బీచ్ రోడ్ కోసం చాలా పెద్ద దినపత్రికలలో కథలను వచ్చినప్పుడుకి ప్రభుత్వంలో ఎప్పుడూ చలనం కనపడలేదు. కొన్ని వందల మంది వాహనదారులు ఈ రోడ్డుపై నుండి వెళ్తూ వస్తుంటారు. ప్రతి ఒక్కరు అదే మాట బీచ్ రోడ్ కి మోక్షం ఇప్పుడు కలుగుతుంది అనేవారు. కొంతమంది ఈ రోడ్డు నుండి వెళ్లలేక పిఠాపురం నుండి కాకినాడ వెళ్తుంటారు తుఫాను వచ్చినప్పుడు సముద్ర కెరటాల తాకిడికి రోడ్డు పూర్తిగా దెబ్బ తినడం అమావాస్య పౌర్ణమికి ఆటుపోటుతో సముద్ర కెరటాలు రోడ్డుపైకి రావడం దీంతో ఇటుగా వచ్చే ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా సముద్రం కెరటాలు ప్రయాణికుల మీదకి రావడంతో భయం బ్రాంతులు చెందుతున్నారు. ఈ రోడ్డుపై నుండి రావాలంటే కొంతమంది ఇష్టపడటం లేదు ఎందుచేతంటే టు వీలర్ ఆటోలు గోతులో పడగానే వారు నొప్పులతో బాధపడుతున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గత ప్రభుత్వం పట్టించుకోకపోయినా ఎన్డీఏ ప్రభుత్వం పరిశీలించి గత పూర్వ వైభవం తీసుకురావాలని బీచ్ రోడ్డుకు మరమ్మత్తులు చేసి కొత్తగా రోడ్డు నిర్మించాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు.