ఎంపీ గా గెలుపు తిరుమలకు మోకాళ్లపై నడుచుకుంటూ వెళ్లి మొక్క తీర్చుకున్న కార్యకర్త
ఎంపీ గా గెలుపు తిరుమలకు మోకాళ్లపై నడుచుకుంటూ వెళ్లి మొక్క తీర్చుకున్న కార్యకర్త
- కర్నూలు ఎం.పిగా నాగరాజు గెలవడంతో తిరుపతిలో మొక్కు తీర్చుకున్న టిడిపి కార్యకర్త..
- మెట్ల మార్గాన మోకాళ్ళ పై నడుచుకుంటూ వెళ్లి మొక్కు తీర్చుకున్న బాలాజీ..
కర్నూలు, జులై 08 (పీపుల్స్ మోటివేషన్):-
గడిచిన ఎన్నికల్లో కర్నూలు ఎం.పిగా బస్తిపాటి నాగరాజు విజయం సాధించడంతో టిడిపి కార్యకర్త తిరుపతిలో మొక్కు తీర్చుకున్నాడు.. ఎం.పి సొంత గ్రామం పంచలింగాల కి చెందిన బాలాజీ అనే కార్యకర్త సోమవారం మెట్ల మార్గాన మోకాళ్ళ పై నడుచుకుంటూ కొండ పై కి వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకొని మొక్కు తీర్చున్నారు.. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ ఎం.పి నాగరాజు అంటే మొదటి నుంచి తనకు ఎనలేని అభిమానమని, ఆయన ఎం.పి గా గెలిస్తే తిరుపతి మెట్ల మార్గాన మోకాళ్ళ పై కొండ పైకి వస్తానని మొక్కుకున్నానన్నారు.. ఆ మొక్కును ఇప్పుడు తీర్చుకున్నానని తెలిపారు.. కాగా గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి కర్నూలు ఎం.పి గా పోటీ చేసిన నాగరాజు, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీ.వై రామయ్య పై ఒక లక్ష్యా పదకొండు వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.