రైతుల భూములకు సరైన పరిహారం చెల్లిస్తాం...
రైతుల భూములకు సరైన పరిహారం చెల్లిస్తాం..
-జిల్లా సంయుక్త కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య...
కర్నూలు, జూలై 09 (పీపుల్స్ మోటివేషన్):-
కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేస్తున్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రాజెక్టు 765 కేవి కర్నూలు -3 పవర్ లైన్ ల నిమిత్తం రైతుల నుండి సేకరించు భూములకు సరైన విలువ కట్టి పరిహారం చెల్లిస్తామని జిల్లా సంయుక్త కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య తెలిపారు.
మంగళవారం ఉదయం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఓర్వకల్లు మండలము నకు చెందిన రైతులతో సంయుక్త కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ టవర్ లు , పవర్ లైన్ లు ఏర్పాట్లు చేయటానికి మరియు కార్పొరేషన్ అవసరాల నిమిత్తం రైతుల భూములు సేకరించ వలసి వస్తున్నదని అందుకుగాను రైతులు సహృదయంతో సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా రైతులు అధిక మొత్తంలో పరిహారం చెల్లించాలని జాయింట్ కలెక్టర్ ను కోరారు.. ఒక టవర్ ఏర్పాటు నిమిత్తం దాదాపు ఏడు సెంట్లు మరియు ఇతర అవసరాల నిమిత్తం దాదాపు అర్థ ఎకరా కూడా సేకరించడం జరుగుతుందని , వీటికి తగిన పరిహారం ఇచ్చే విధంగా, అందరికి మంచి చేసే చర్యలు తీసుకుంటామని రైతులకు జేసీ తెలియజేశారు.
ఈ సమావేశానికి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సీనియర్ జనరల్ మేనేజర్ ఎస్ . కే .చౌహన్ , డీజీఎం జి.నాగరాజు , కర్నూలు ఆర్డిఓ శేషిరెడ్డి మరియు రెవెన్యూ ల్యాండ్ అక్విషన్ అధికారులు పాల్గొన్నారు.