పరీక్షా కేంద్రం, నగరాల వారిగా వివరాలు ఇవ్వండి ఎన్టీఏ ని ఆదేశించిన సుప్రీం కోర్టు
పరీక్షా కేంద్రం, నగరాల వారిగా వివరాలు ఇవ్వండి ఎన్టీఏ ని ఆదేశించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, జూలై 18 (పీపుల్స్ మోటివేషన్):-
నీట్-యూజీ పేపర్ లీకేజీ, పరీక్ష నిర్వహణలో అవకతవకలపై విచారణ జరుపుతోన్న భారత సర్వోన్నత న్యాయస్థానం.. సుప్రీం కోర్టు.. పరీక్ష కేంద్రం, నగరాల వారీగా వాటి ఫలితాలు ప్రకటించాలని ఎన్డీఏను ఆదేశించింది. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు వాటిని వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని పేర్కొంది. 'నీట్- యూజీ' సంబంధిత పిటిషన్లను జులై 22న తిరిగి విచారిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. పరీక్ష కేంద్రాల వారీగా ఫలితాలను వెల్లడించేటప్పుడు విద్యార్థుల వివరాలను కనిపించకుండా చూడాలనీ సూచించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. విస్తృత స్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని గుర్తిస్తేనే రీటెస్టు ఆదేశించగలమని సందర్భంగా స్పష్టం చేసింది. ఈ సందర్భంగా తీవ్ర వాదనలు కొనసాగాయి. ప్రాథమిక ఆధారాల ప్రకారం, ప్రశ్నపత్రం లీకేజీ కేవల పట్నా, హజారీబాగ్లకే పరిమితమైనట్లు కనిపిస్తోందని కోర్టు పేర్కొంది. అయితే, గుజరాత్లో అలాంటిదేమీ జరగలేదని చెప్పలేమని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పేపర్ లీక్ కొన్ని కేంద్రాలకే పరిమితమైందా? లేదా ఇతర కేంద్రాలు, దేశవ్యాప్తంగా వ్యాపించిందా? అనే విషయాలు తెలిసేందుకు ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంచడం కీలకమని వ్యాఖ్యానించింది. అయితే, విద్యార్థుల గోప్యత దృష్ట్యా వారి వివరాలు కనిపించడకుండా ఉంచాలని తెలిపింది.