-Advertisement-

Conocarpus: ఆ చెట్టు గాలి పీలిస్తే ఆస్తమా, శ్వాసకోస ఇబ్బందులు తప్పవా.. !

Conocarpus tree ban Conocarpus tree in Telugu Is Conocarpus tree harmful Conocarpus uses Conocarpus tree oxygen Conocarpus trees losses Disadvantages
Janu

Conocarpus: ఆ చెట్టు గాలి పీలిస్తే ఆస్తమా,  శ్వాసకోస ఇబ్బందులు తప్పవా.. !

  • కాకినాడలో కోనో కాన్ఫరస్ చెట్లను తొలగించాలని కలెక్టర్ ఆదేశం....
  • ఈ పువ్వుల పుప్పొడి కారణంగా ఆస్తమా.. శ్వాసకోస ఇబ్బందులు...
  • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన కాకినాడ వాసులు....
  • ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వాటిని తొలగించడం మంచిది- పవన్ కల్యాణ్....

సాధారణంగా పచ్చగా, ఏపుగా పెరిగే మొక్కలను అందరూ ఇళ్లలో పెంచుకోవడానికి ఇష్ట పడుతుంటారు. ఈ నేపథ్యంలో చూసేందుకు అందంగా కనిపించే కోనో కార్పస్ అనే మొక్కను రోడ్డు డివైడర్ల మధ్యలో, నర్సరీల్లో, ఇళ్లల్లోనూ పెంచుతున్నారు. 

Conocarpus plant Conocarpus tree ban Conocarpus tree in hindi Is Conocarpus tree harmful Conocarpus fruit Conocarpus tree oxygen Conocarpus trees

ఈ మొక్క నాటిన కొన్ని వారాల్లోనే ఏపుగా పెరుగుతుంది. అయితే.. ఈ మొక్కలు నాటొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో.. కాకినాడలో కోనో కాన్ఫరస్ చెట్లను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మొక్కల కారణంగా పట్టణ ప్రాంత ప్రజల్లో శ్వాసకోస సమస్యలు, ఆస్తమా తలెత్తుతున్నాయని గుర్తించారు. అంతేకాకుండా ఈ చెట్టు భూ గర్భంలోని జలాన్ని ఇట్టే తోడేస్తుందని.. ఒక్కసారి ఈ మొక్కను నాటితే 80 మీటర్ల వరకూ దీని వేరు భూమిలోకి వెళ్లిపోయి నీరును తాగేస్తుందని హెచ్చరిస్తున్నారు. అసలు కోనో కాన్ఫరస్ చెట్లు అంటే ఏమిటి.. ఎందుకు తొలగించామంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

కోనో కాన్ఫరస్ చెట్లను తెలుగులో ఏడాకుల చెట్లు, ఇంగ్లీష్ లో డెవిల్ ట్రీ అంటారు. ఈ చెట్లకు అక్టోబర్ నుంచి జనవరి వరకు పువ్వులు పుస్తాయి. ఈ పువ్వుల పుప్పొడి కారణంగా ఆస్తమా, శ్వాసకోస ఇబ్బందులు వస్తాయి. ఈ క్రమంలో.. కాకినాడ వాసులు ఈ చెట్ల గురించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా.. అటవీ శాఖ సమీక్షలో దీనిపై వివరించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వాటిని తొలగించడం మంచిదని అన్నారు. గతంలో కూడా తన ఫాంహౌస్ లో ఈ చెట్లను పెంచానని.. అయితే వాటితో ప్రమాదం అని తెలిసి తొలగించానన్నారు. అయితే కాకినాడలో మొత్తం 4,602 కానో కాన్ఫరస్ చెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని దశల వారీగా తొలగించాలని అధికారులకు సూచించారు. దాని వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని పేర్కొన్నారు.

Comments

-Advertisement-