Drinking Hot Water: గోరువెచ్చని నీటిని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు తెలుసా..!
Drinking Hot Water: గోరువెచ్చని నీటిని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు తెలుసా..!
- రోజంతా కనీసం ఐదు గ్లాసుల వేడినీరు త్రాగాలని లక్ష్యంగా ఉంచుకోండి...
- ICMR ప్రకారం.. ప్రతిరోజూ 8 గ్లాసుల నీరు త్రాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ ఆరోగ్యంగా ఉంచుతుంది...
- టీ కాఫీ వంటి క్యాలరీ కంటే వేడి నీటిని ఎంచుకోవడం మీ బరువు తగ్గించే లక్ష్యంలో సహాయపడుతుంది..
ఉదయాన్నే కాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో మనమందరం చాలా చదువుతూనే ఉంటాం.
నిజానికి, ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఒకటి రెండు కాదు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియను ఎంతగానో మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. దీనితో పాటు, ఇది మీ చర్మానికి ప్రయోజనం చేకూరుస్తుంది. ముఖ్యంగా బరువును కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా గోరువెచ్చని నీటితో బరువు తగ్గడం, బొడ్డు కొవ్వును తగ్గించడం అనే విషయాలు చాలా ప్రసిద్ధి. ఇక ఈ విషయాలలో ఎంత నిజం ఉందో ఓసారి తెలుసుకుందాం.
నిజానికి వేడినీరు కొవ్వును కరిగించదు. కానీ., శరీరాన్ని బాగా హైడ్రేట్గా ఉంచడం.. అలాగే టీ కాఫీ వంటి క్యాలరీ పానీయాల కంటే వేడి నీటిని ఎంచుకోవడం మీ బరువు తగ్గించే లక్ష్యంలో సహాయపడుతుంది. దీనితో పాటు, మీరు సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా శారీరక శ్రమ కలిగి ఉంటే మీరు మరింత త్వరగా మంచి ఫలితాలను పొందుతారు. కొంతమంది డాక్టర్లు నివేదికల ప్రకారం.. వేడి నీటిని తాగడం వల్ల మీ శరీరం ఆహారంలోని కొవ్వు అణువులను మరింత సమర్థవంతంగా విచ్ఛిన్నం చేస్తుందని., ఇది శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుందని వాయు తెలిపారు. ఇక్కడ నీరు మీ శరీరానికి తట్టుకోగల ఉష్ణోగ్రతలో ఉండేలా చూసుకోవడం కూడా ముఖ్యం. ఇలా ఎందుకంటే.. మరి వేడిగా ఉంటె నోటికి ఇబ్బంది కాకుండా ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ గోరువెచ్చని నీరు త్రాగాలి.వేడి లేదా గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది పోషకాల శోషణ మరియు జీవక్రియను పెంచుతుంది. పొడి చర్మానికి వేడినీరు కూడా మేలు చేస్తుంది. అలాగే మలబద్ధకం నుండి ఉపశమనం అందించడంలో సహాయపడుతుందని డాక్టర్లు తెలిపారు. మెరుగైన ఫలితాల కోసం ఉదయం నిద్రలేచిన వెంటనే, భోజనానికి ముందు వేడినీళ్లు తాగాలని వైద్యులు చెబుతున్నారు. నీటి ఉష్ణోగ్రత సుమారు 50 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. స్నానానికి ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు కూడా మీ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇది కాకుండా., భోజనానికి ముందు నీరు త్రాగడం వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది కేలరీలను ఎక్కువగా తీసుకోవడం తగ్గిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.., వేడి నీరు రక్తపోటును నియంత్రించడంలో, చర్మం మెరుపును పెంపొందించడంలో, జీర్ణక్రియకు సహాయం చేస్తుంది. శరీరం నుండి విషాన్ని తొలగించడంలో, పీరియడ్స్ సంబంధిత సమస్యలను తగ్గించడంలో గోరువెచ్చని నీరు తాగడంవల్ల సహాయపడుతుంది. రోజంతా కనీసం ఐదు గ్లాసుల వేడినీరు త్రాగాలని లక్ష్యంగా ఉంచుకోండి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మార్గదర్శకాల ప్రకారం., ప్రతిరోజూ 8 గ్లాసుల నీరు త్రాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్, ఆరోగ్యంగా ఉంచుతుంది.