LPG సిలిండర్లకు క్యూఆర్ కోడ్ లు
LPG సిలిండర్లకు క్యూఆర్ కోడ్ లు
లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సిలిండర్లకు క్యూఆర్ కోడ్ లు అమలు చేయాలనే ప్రతిపాదన పై చర్చ జరుగుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.
• సిలిండర్లకు క్యూఆర్ కోడ్ లు అమలు చేయడం వల్ల వంటగ్యాస్ సరఫరాలోని అవకతవకలను తగ్గించడానికి, సిలిండర్ల ట్రాకింగ్కు, ఏజెన్సీల ఇన్వెంటరీ నిర్వహణకు సహాయపడుతుంది.
• క్యూఆర్ కోడ్ ముసాయిదాను గ్యాస్ సిలిండర్ రూల్స్ (GCR)లో చేర్చారు. త్వరలో దీనిపై తుది నోటిఫికేషన్ వెలువడుతుంది.
• నివాసాలకు 30-50 మీటర్ల లోపు పెట్రోల్ పంపులు పని చేసేలా భద్రతా చర్యల నమూనా రూపొందించారు. ఈ చర్యకు అవసరమైన మార్గదర్శకాలను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) రూపొందించనుంది.
• ఈ భద్రతా చర్యలను అమలు చేయడానికి "పెట్రోలియం అండ్ ఎక్స్ ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (PESO)" బాధ్యత వహిస్తుంది.
• డీపీఐఐటి (పరిశ్రమ ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం) కింద పనిచేస్తుంది.
• 1884 ఎక్స్ ప్లోజివ్స్ చట్టం, 1934 పెట్రోలియం చట్టం నిబంధనలను అమలు చేస్తుంది.
• పెసో మంజూరు చేసిన లైసెన్స్ల లైసెన్సింగ్ ఫీజులో మహిళా పారిశ్రామికవేత్తలకు 80%, MSME లకు 50% రాయితీ ఇవ్వబడుతుంది.