-Advertisement-

Milk: ఆ దేశంలో లీటర్ పాల ధర రూ.370...!

About milk rates in different countries daily news in Telugu daily political updates latest crime news in Telugu breaking news Telugu intresting facts
Priya

Milk: ఆ దేశంలో లీటర్ పాల ధర రూ.370...!

Milk price in pak: పాకిస్థాన్లో పాల ధరకు రెక్కలొచ్చాయి. లీటర్ పాల ధర ఏకంగా రూ.370కి చేరింది.

About milk rates in different countries daily news in Telugu daily political updates latest crime news in Telugu breaking news Telugu intresting facts

Milk price | కరాచీ: ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల

ధరలతో అల్లాడుతున్న పాక్ పౌరులకు అక్కడి ప్రభుత్వం మరో షాకిచ్చింది. కొత్తగా పాలపై పన్ను విధించింది. దీంతో స్థానికంగా పాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలైన ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కంటే పాల ధరలు పాక్లోనే అధికంగా ఉన్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు సైతం అక్కడి ప్రజలను బెంబేలెత్తిస్తున్న సంగతి తెలిసిందే.

పాకిస్థాన్ పాలపై ఎలాంటి పన్నూ ఉండేది కాదు. అలాంటిది గత వారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్యాకేజ్డ్ పాలపై అక్కడి ప్రభుత్వం 18 శాతం పన్ను విధించింది. దీంతో పాల ధరలు శాతం పైగా పెరిగాయి. కొత్తగా పన్ను వేయడంతో కరాచీలో అల్ట్రా హై టెంపరేచర్ పాల ధర 370 రూపాయలకు (పాక్ కరెన్సీ) చేరింది. డాలర్ల ప్రకారం చూస్తే లీటర్ పాల ధర 1.33 డాలర్లుగా ఉంది. పారిస్ లో లీటర్ పాల ధర 1.23 డాలర్లు కాగా.. మెల్బోర్న్ 1.08 డాలర్లు మాత్రమే.

పాల ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరోవైపు, వేతనాలు అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో ఖర్చు చేసే సామర్థ్యం మరింత క్షీణించే అవకాశం ఉందని చెబుతున్నారు. పాక్ లో ఇప్పటికే సుమారు 40 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారని, ముఖ్యంగా పేదరికంలో ఉన్న చిన్నారుల్లో పౌష్టికాహార లోపానికి ఇది దారితీస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. బెయిలవుట్ ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) విధించిన షరతులను అందుకోవడంలో భాగంగా పాకిస్థాన్ ఇటీవల బడ్జెట్లో ఏకంగా 40 శాతం మేర పన్నులు పెంచింది.

Comments

-Advertisement-