Operation muskan: ఆపరేషన్ ముస్కాన్ అంటే ఏమిటి..ఇది ఎవరికోసం..?
Operation muskan: ఆపరేషన్ ముస్కాన్ అంటే ఏమిటి..ఇది ఎవరికోసం..?
బాల్యాన్ని వెట్టి నుంచి విడిపించేందుకు 'ఆపరేషన్ ముస్కాన్'..
ఈ నెల 31 వరకు జరిగే కార్యక్రమం..
Operation Muskan: 'ఆపరేషన్ ముస్కాన్' అనేది పిల్లలను బానిసత్వం నుండి విముక్తి చేసే కార్యక్రమం. ఈ నెల 31 వరకు జరిగే ఈ కార్యక్రమానికి అధికారులు సన్నద్ధమయ్యారు. ఇందుకోసం ఐదు బృందాలను నియమించారు. ప్రతి ఏటా జూలై 1 నుంచి 31వ తేదీ వరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ప్రత్యేక తనిఖీలు నిర్వహించి బాల కార్మికులను గుర్తించడం జరుగుతుందన్నారు. లక్షిత దాడులకు ప్రణాళిక సిద్ధం చేశారు. పిల్లలతో పనిచేసే అవకాశాలు ఉన్న స్థావరాలు గుర్తించారు. జిల్లాలోని పలు పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, గోదాములు, గోదాములు, మెకానిక్ షాపులు తదితర ప్రాంతాల్లో వ్యూహాత్మక తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గతేడాది 33 మందికి వెట్టి నుంచి విముక్తి కల్పించారు. వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వారిలో 14 మంది బాలికలు కాగా, మిగిలిన వారు బాలురు. మైనర్లతో పని చేస్తున్న ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. బాధితుల్లో ఎవరైనా అనాథలైతే, వారిని చైల్డ్ కేర్ హోమ్లో ఉంచుతారు. అవసరమైన ప్రక్రియను పోలీసు శాఖ పూర్తి చేస్తుంది.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్-10 కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పరిశ్రమలు, వ్యాపార సముదాయాల్లో ఈ ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహిస్తాయని, పిల్లలను పనిలో పెట్టుకునే యజమానులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ ప్రత్యేక బృందాలు పట్టుబడిన పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగిస్తామని, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ అందించి, అనాథలుగా ఉంటే వారిని కేరోమ్కు తరలించనున్నట్లు ఆమె తెలిపారు. బాధితుల్లో ఎవరైనా అనాథలైతే, వారిని చైల్డ్ కేర్ హోమ్లో ఉంచుతారు. అవసరమైన ప్రక్రియను పోలీసు శాఖ పూర్తి చేస్తుంది. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే వెంటనే 100 లేదా 1098కు డయల్ చేయాలని, జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712659360కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు.