Salt: అతిగా ఉప్పు తినడం వల్ల చాలా ప్రమాదం..డబ్ల్యూహెచ్ వో ఏం చెప్తోంది..
Salt: అతిగా ఉప్పు తినడం వల్ల చాలా ప్రమాదం..డబ్ల్యూహెచ్ వో ఏం చెప్తోంది..
- ఉప్పును అతిగా తీసుకోవడం వల్ల మానవ ఆరోగ్యంపై ఊహించని స్థాయిలో నష్టం...
- అతిగా ఉప్పు తీసుకోవడం వల్ల ఏటా 18.9 లక్షల మంది...
- ఇటీవల ఓ నివేదికలో వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ...
వంటకాల రుచిని పెంచడంలో ఉప్పు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఉప్పుల లేనిది ఏ కూరా తినలేం. రుచిని పెంచుతుంది కదా అని అధికంగా ఉప్పును తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. దాని పరిమానం మితంగా ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఏ పదార్ధంలోనైనా ఉప్పు, పంచదార రుచిని పెంచే లవణాలు. అలాంటి అత్యంత ప్రధాన పదార్ధాలను పరిమితికి మించి ఉపయోగిస్తే ముప్పు తప్పదంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మరీ ముఖ్యంగా ఉప్పును అతిగా తీసుకోవడం వల్ల మానవ ఆరోగ్యంపై ఊహించని స్థాయిలో నష్టం వాటిల్లుతున్నదని పేర్కొంది. ఆహారంలో, లేదా మరే ఇతర తినే పదార్థాల్లో అయినా ప్రతీ రోజు కేవలం 5 గ్రాములు మించి ఉప్పును తీసుకుంటే అది ఆరోగ్యంపై ఊహించని స్థాయిలో నష్టం కలిగిస్తుందని డబ్లూహెచ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉప్పు ప్రాణానికి ముప్పుని ..డబ్లూహెచ్ వో అధ్యయనంలో తేలింది.
అతిగా ఉప్పు తీసుకోవడం వల్ల ఏటా 18.9 లక్షల మంది మృతి చెందుతున్నారనే భయాందోళన కలిగించే విషయాన్ని వెల్లడించింది. సాల్ట్ ను అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండె సమస్యలు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, స్థూలకాయం, కిడ్నీ వ్యాధులు బారినపడే అవకాశాన్ని పెంచుతుందని తెలిపింది. శరీరంలో 'సోడియం' కీలకమే అయినా, రోజుకు 2000 మిల్లీగ్రాములు మించి తీసుకోకూడదు. మోతాదుకు మించిన ఉప్పు శరీరంలోకి వెళడం వల గుండె. కిడ్సీ. మెదడుపై ప్రభావం చూపుతోందన్న డబ్ల్యూహెచ్వి హెచ్చరిస్తోంది. శరీరంలో కీలక అవయవాలు దెబ్బతిని ప్రమాదం ఉందని చెబుతోంది. దీంతో పాటు అధిక రక్తపోటు సమస్య పెరిగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఉప్పుకు బదులు నిమ్మరసం, వెనిగర్, వోమ, నానబెట్టిన సబ్జ గింజలు మొదలైనవి ఆహారంలో వాడొచ్చునని డబ్ల్యూహెచ్వో సూచిస్తున్నది. ప్రాసెస్ చేసిన ఆహారం మానేయాలని.. వెల్లడించింది.