-Advertisement-

SCR RAILWAY JOBS: భారీగా రైల్వే లోకో పైలట్ ఉద్యోగాల భర్తీ...!

Railway jobs telugu Railway Jobs 2024 Railway Jobs apply online Railway Jobs in ap 2024 Railway Recruitment 2024 apply online Railway Recruitment Boar
Janu

SCR RAILWAY JOBS: భారీగా రైల్వే లోకో పైలట్ ఉద్యోగాల భర్తీ...!

  • ఆర్ఆర్బీ ఏఎల్పీ రిక్రూట్మెంట్ 2024...
  • దేశ వ్యాప్తంగా 18799 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు భర్తీ..
  • సికింద్రాబాద్ (SCR) పరిధిలో 2528 ఖాళీల పోస్టులు భర్తీ..

ఉద్యోగాలకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. గత ఏడాది జనవరిలో వివిధ రైల్వే జోన్లలో లోకోమోటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి RRB ఉద్యోగ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

South Central Railway Secunderabad Recruitment 2024 scr.indianrailways.gov.in apply online SCR Railway zone Railway Jobs 2024 Railway Recruitment

 ఈ నోటిఫికేషన్ లో 5,696 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దేశంలోని వివిధ రైల్వే జోన్లలో మొత్తం 18,799 అసిస్టెంట్ లోకోమోటివ్ డ్రైవర్ల పోస్టులను భర్తీ చేయాలని ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రతి జోన్ లో ఉన్న ఖాళీల గురించి సమాచారం తెలిసింది. దీని ప్రకారం.. సికింద్రాబాద్ రైల్వే జోన్ పరిధిలో 2528 ఖాళీలు ఉన్నాయి. ఇక బిలాస్ పూర్ జోన్ లో అత్యధికంగా 4435 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు త్వరలో నమోదుకు అవకాశం కల్పించనున్నట్లు ఆర్ఆర్బీ స్పష్టం చేసింది. ఈ విషయంలో తదుపరి మార్గదర్శకత్వం కోసం అభ్యర్థులు వెబ్సైట్ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని

అభ్యర్థించారు. అభ్యర్థులు CBT-1 స్టేజ్ 1, CBT-2 స్టేజ్ 2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేయబడతారు. ఇక ఆర్ఆర్ఆ్బ రీజియన్లలో ఈ అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 19,900 నుండి రూ. 63,200 వరకు జీతం అందిస్తుంది రైల్వే. ఇక దేశవ్యాప్తంగా ఉన్న అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, ముజఫర్పూర్, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీఘడ్, చెన్నై, గువాహటి, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్కతా, మాల్టా, ముంబయి, తిరువనంతపురం, గోరఖ్పూర్ రీజియన్లలో ఉద్యాగాలు భర్తీ కానున్నాయి.ఇక అభ్యర్థులు ఈ విషయంలో తదుపరి ప్రకటన కోసం https://www.rrbcdg.gov.in/ అనే వెబ్సైట్ను చెక్ చేసుకుంటూ ఉండాలని తెలిపింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. అలా కాకపోయినా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా చేసిన వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏదైనా ఏఐసీటీఈ గుర్తింపు విద్యాసంస్థ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉన్న వాళ్లు కూడా దరఖాస్తును చేసుకోవచ్చు.

Comments

-Advertisement-