UNO: ఏదైనా 'షేర్' చేసేటప్పుడు ఈ ఐదు ప్రశ్నలు వేసుకోండి..!
Telugu daily news
Trending news
Daily updates
Breaking news
Telugu latest news
Telugu daily news updates
Telugu short news
Politic news updates telugu
By
Janu
UNO: ఏదైనా 'షేర్' చేసేటప్పుడు ఈ ఐదు ప్రశ్నలు వేసుకోండి..!
ఏటా జూన్ 30న సామాజిక మాధ్యమాల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. సోషల్ మీడియా ప్రభావం, వాటి సద్వినియోగంపై అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. ఆన్లైన్లో తప్పుడు సమాచార వ్యాప్తి ద్వారా విద్వేషాలు, ఆందోళనలు చెలరేగే ముప్పు ఉంది. కాబట్టి సామాజిక మాధ్యమాల్లో ఏదైనా సమాచారాన్ని పంచుకొనేముందు ఈ అయిదు ప్రశ్నలు వేసుకోండి:
1. ఆ సమాచారాన్ని ఎవరు రూపొందించారు
2. దానికి మూలం ఏంటి?
3. దాన్ని మీతో ఎవరు పంచుకున్నారు?
4. మీరు ఎందుకు ఇతరులతో పంచుకోవాలనుకుంటున్నారు?
5. అది తాజా సమాచారమేనా?
ఈ విషయాలను నిర్ధారించుకొంటే తప్పుడు సమాచారాన్ని నిరోధించొచ్చు.
Comments