Weight Loss: బరువు తగ్గాలనేవారు ఈ నియమాలు పాటించండి..!
Weight Loss: బరువు తగ్గాలనేవారు ఈ నియమాలు పాటించండి..!
- అధిక బరువు వల్ల అనేక వ్యాధులు....
- వ్యయామం.. సమతుల్య ఆహారంతో సమస్య దూరం....
- జీవనశైలిలో మార్పులతో కొవ్వును శాశ్వతంగా తగ్గించుకోవచ్చు...
అధిక బరువు చాలామంది మహిళల్లో ఆందోళనకు గురిచేస్తోంది. ఉబకాయం వల్ల ఇంటి, ఆఫీసు పనులు సరిగా చేసుకోలేకపోతున్నారు. కొందరిది కూర్చుంటే లేవలేని పరిస్థితి. మరికొందరు అడుగుతీసి అడుగు వేయలేకపోతున్నారు.
బరువు తగ్గాలంటే పండ్లు, కూరగాయలు, బాదంపప్పు వంటి ఆహారాలతో సహా సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఎక్సర్సైజ్ చేయడం, జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా కూడా కొవ్వును శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. శరీరం చక్కగా పని చేయడానికి, బరువు తగ్గడానికి హైడ్రేటెడ్గా ఉండాలి. వాటర్ తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల ఎక్కువగా తినలేరు. నీటి శాతం ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినాలి. హెర్బల్ టీలు తాగాలి. వారానికి కనీసం 150 నిమిషాలు మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయాలి.
75 నిమిషాలు హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ తప్పనిసరి. నడక, పరిగెత్తడం, ఈత, సైక్లింగ్, డ్యాన్స్ వంటివి కార్డియో వ్యాయామానికి కొన్ని ఉదాహరణలు. వ్యాయామం చేయడం, బరువులు ఎత్తడం, ఇతర ఎక్సర్సైజ్లు చేస్తే మజిల్స్, మెటబాలిజం పెరిగి, శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గడానికి, బాడీలో ఫ్యాట్ కరగడానికి ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినాలి. బాదం, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటివి డైట్లో చేర్చుకోవాలి. ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతాయి. డైజెషన్కు కూడా మంచివి. ఆకలితో ఉన్నప్పుడు జంక్ ఫుడ్ కాకుండా బాదంపప్పు వంటి నట్స్ తినాలి. దీంతో ఆకలి, కేలరీల ఇన్టేక్ తగ్గుతుంది. దీనివల్ల శరీర కొవ్వును వదిలించుకోవడం ఈజీ అవుతుంది. మైండ్ఫుల్ ఈటింగ్ అంటే తినడం, తాగడంపై పూర్తిగా దృష్టి పెట్టడం. భోజనాన్ని మరింత ఎంజాయ్ చేయవచ్చు. దీర్ఘకాలిక ఒత్తిడి బరువు పెరగడానికి కారణమవుతుంది. బరువు తగ్గడం కష్టతరం చేస్తుంది. ఒత్తిడిని బాగా మేనేజ్ చేసుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయి. ధ్యానం, యోగా లేదా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయాలి. ఈ నియమాలు పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి.