BP: బీపీతో ఆ వ్యాది వచ్చే అవకాశం!
General News telugu latest news telugu intresting news telugu intresting facts
Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC JOBS current news
By
Pavani
BP: బీపీతో ఆ వ్యాది వచ్చే అవకాశం!
బీపీ ఉందా... అయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా దాన్ని అదుపులో ఉంచుకోండి. వీలైతే దాన్ని పూర్తిగా తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. అంటే రక్తపోటుని నియంత్రించే నివారించే ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకోండి. లేదంటే మతిమరుపు వచ్చే ప్రమాదం ఎక్కువ అని హెచ్చరిస్తున్నారు న్యూసౌత్వేల్స్, లా ట్రోబ్, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ నిపుణులు. ఎందుకంటే ఆ వర్సిటీల పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన 17 అధ్యయనాల్లో- అరవై ఏళ్లు దాటిన బీపీ బాధితుల్లో ఎక్కువమంది మతిమరుపు బారిన పడినట్లు తెలిసింది. ఇందు కోసం వాళ్లు దాదాపు 16 దేశాల నుంచి సుమారు 35 వేల మంది బీపీ రోగుల్ని ఎంపిక చేసుకుని పరిశీలించారట. అందులో రక్తపోటుని మందులతో అదుపులో ఉంచుకున్నవాళ్లలో మతిమరుపు శాతం తక్కువగానూ, బీపీని పట్టించుకోకుండా ఎలాంటి జాగ్రత్తలూ తీసు కోనివాళ్లలో డిమెన్షియా బాధితులు ఎక్కువగానూ ఉన్నారట. దీని ఆధారంగా- బీపీ కూడా మతిమరుపునకు దారితీసే ప్రమాదం లేకపోలేదు అంటున్నారు సదరు పరిశోధకులు!
Comments