-Advertisement-

Condom: దేశవ్యాప్తంగా కండోములపై సర్వేలో ఆసక్తికర విషయాలు..

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC NHS CONDOM SURVEY NEWS
Peoples Motivation
Condom: దేశవ్యాప్తంగా కండోములపై సర్వేలో ఆసక్తికర విషయాలు..

జాతీయ కుటుంబ ఆరోగ్య విభాగం చేపట్టిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాల్లో దాద్రానగర్ హవేలీ టాప్
ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక వినిమయం 
ప్రతి 10 వేల మందిలో 978 జంటల వినియోగం
కండోములు వాడేందుకు బెంగళూరు వాసుల అనాసక్తి
ఎయిడ్స్, సుఖవ్యాధులు లాంటి ప్రమాదకర వ్యాధుల నేపథ్యంలో సురక్షిత శృంగారంపై అందరికీ అవగాహన పెరిగింది. దీనికితోడు అవాంఛిత గర్భం, కుటుంబ నియంత్రణ వంటి వాటికి ఇవి రక్షణ కవచాలుగా పనికొస్తాయి. ఈ విషయంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు కూడా ఫలితాన్నిస్తున్నాయి. దీంతో కండోముల వినియోగం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో మన దేశంలో లైంగిక విజ్ఞానం ఏ రాష్ట్రంలో ఏ మేరకు ఉందో తెలుసుకునేందుకు ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC NHS CONDOM SURVEY NEWS


ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా....
కేంద్రపాలిత ప్రాంతాల్లో దాద్రానగర్ హవేలీ
కండోముల వినియోగంలో కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రానగర్ హవేలీ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ ప్రతి 10 వేలమందిలో 993 మంది కండోములు ఉపయోగిస్తున్నారట. ఇక, రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో ఉంది. ఇక్కడ శృంగారంపై ప్రజల్లో చక్కని అవగాహన ఉంది. రాష్ట్రంలో ప్రతి 10 వేల మందిలో 978 జంటలు కండోములు వినియోగిస్తున్నట్టు సర్వే పేర్కొంది.     
    
కర్ణాటకలో తక్కువ వినియోగం....
కర్ణాటక రాజధాని బెంగళూరు వాసులు మాత్రం కండోముల ఉపయోగానికి నో చెబుతున్నారు. ఇక్కడ ప్రతి 10 వేల మందిలో 307 జంటలు మాత్రమే కండోములు ఉపయోగిస్తున్నారు. మిగతావారు వాటి పేరెత్తడానికి కూడా ఇష్టపడడం లేదట. ఇక, ఏపీ తర్వాత పుదుచ్చేరిలో 960 మంది, పంజాబ్‌లో 895 మంది, హర్యానాలో 685 మంది కండోములు ఉపయోగిస్తున్నారు. సర్వేలో బాగా దిగువన ఉన్న రాష్ట్రాల్లో కండోముల వాడకంపై అవగాహన పెంచేందుకు ఎన్ఎఫ్‌హెచ్ఎస్‌తోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా కృషి చేస్తోంది. 

దేశంలో తగ్గుతున్న వినియోగం...
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం భారత్‌లో క్రమంగా కండోముల వినియోగం తగ్గుతోందట. దేశంలో ప్రతి ఏడాది 3.3 బిలియన్ల కండోములు అమ్ముడుపోతున్నాయి. వీటిలో 53 లక్షల కండోములు ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే వినియోగిస్తున్నారట. యూపీ అతిపెద్ద రాష్ట్రం కావడం, కండోముల వినియోగంపై యోగి ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయడం కూడా ఇందుకు కారణం.
Comments

-Advertisement-