-Advertisement-

Cyber Crime: ప్రెగ్నెంట్ చేస్తే రూ. 5 లక్షలు.. చివరకు పోలీసులను ఆశ్రయించిన యువకుడు

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs notifications
Peoples Motivation
Cyber Crime: ప్రెగ్నెంట్ చేస్తే రూ. 5 లక్షలు.. చివరకు పోలీసులను ఆశ్రయించిన యువకుడు

• సైబర్ ట్రాప్ లో చిక్కుకున్న యువకుడు...

• అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేస్తే రూ. 5 లక్షల జీతం...

• చివరకు మోసపోయామని సైబర్ క్రైమ్ ను ఆశ్రయించిన బాధితుడు...

• చాలా మంది భయపడి పిర్యాదు చేయలేదు...

• యూపీలోని ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి...

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs notifications

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సైబర్ దుండగులు వివిధ మార్గాల్లో ప్రజలను ట్రాప్ చేస్తున్నారు. మౌయిమా ప్రాంతంలో కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఫేస్బుక్లో ఒక వినియోగదారు.. ధనిక కుటుంబాలకు చెందిన అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేస్తే రూ. 5 లక్షల జీతంతో ఉద్యోగం ఇస్తానని తెలిపాడు. ఈ ఆఫర్ చూసి ఓ యువకుడు ట్రాప్లో పడ్డాడు. దీంతో.. సైబర్ దుండగులు అతడిని సంప్రదించి రిజిస్ట్రేషన్ పేరుతో రూ.24800 కట్టించుకున్నారు. ఆ తర్వాత రూ. 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో.. తాను మోసపోయానని బాధిత యువకుడు గ్రహించాడు.

ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని మౌయిమాలోని బక్రాబాద్ ప్రాంతంలో జరిగింది. అల్తాఫ్ ఖాన్ అనే యువకుడు సోషల్ మీడియా వేదికగా ఫేస్ బుక్ లో ఈ ప్రకటనను చూశాడు. అందులో ధనిక కుటుంబాల అమ్మాయిలను గర్భవతిని చేసే ఉద్యోగం ఉందని, ఐదు లక్షల రూపాయల జీతంతో పాటు విలాసాలు కల్పిస్తామని అందులో రాసుంది. ఈ క్రమంలో.. యువకుడు అందులో నంబర్లకు ఫోన్ చేయగా.. అడ్వర్టైజ్ మొదట రూ.800 కట్టాలని చెప్పాడన్నాడు. ఆ తర్వాత రిజిస్ట్రేషకు రూ.24 వేలు పంపించాడు. అడ్వర్టైజర్లు మళ్లీ యువకుడి నుంచి రూ.3 లక్షలు డిమాండ్ చేశారు. అయితే.. అసలు విషయాన్ని బాధితుడు తెలుసుకుని మోసపోయానని గ్రహించాడు. 

సైబర్ మోసగాళ్లు ఎస్పీ, డీఎస్పీల ప్రొఫైల్ ఫోటోలు ఉన్న నంబర్లతో కాల్ చేసి డబ్బు చెల్లించాలని బాధిత యువకుడిని టార్చర్ చేశారు. లేదంటే.. కేసు నమోదు చేసి ఇరికిస్తామని బెదిరించారు. దీంతో యువకుడు భయపడి గ్రామ సామాజిక కార్యకర్తకు విషయం చెప్పాడు. అనంతరం.. బాధితుడు సైబర్ క్రైమ్ ప్రయాగాజ్కు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపి డబ్బులు తిరిగి ఇప్పించాలని డీసీపీ క్రైం బాధితుడు కోరాడు. అయితే.. ఇంతకుముందు కూడా చాలా మంది యువకులు ఇలానే మోసపోయారని.. ఈ క్రమంలో అవమానానికి భయపడి వారు ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు.

Comments

-Advertisement-