Gold Rates: త్వరలో మార్కెట్లోకి 9 క్యారెట్ల బంగారం.. ధర ఎంత ఉండొచ్చు..!!
Gold Rates: త్వరలో మార్కెట్లోకి 9 క్యారెట్ల బంగారం.. ధర ఎంత ఉండొచ్చు..!!
10 గ్రాముల ధర రూ. 25 వేల నుంచి రూ. 30 వేలు..
గొలుసు దొంగతనాలు పెరుగుతున్న క్రమంలో త్వరలో తీసుకొచ్చే యోచనలో కేంద్రం..
ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం 32.54 శాతం గొలుసు దొంగతనాలు పెరిగాయి..
స్వచ్ఛమైన 24-క్యారెట్ల మేలిమి బంగారం గురించి అందరికీ తెలిసిందే. ఆభరణాల తయారీలో 22-క్యారెట్లు, 18-క్యారెట్ల బంగారాన్ని వినియోగిస్తారన్న సంగతి కూడా విదితమే. అయితే, కేంద్ర ప్రభుత్వం త్వరలో 9-క్యారెట్ల బంగారాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు బంగారు నగల వ్యాపారులతో కేంద్రప్రభుత్వం ప్రతినిధులు మంగళవారం భేటీ అయినట్టు జాతీయ పత్రిక ‘మింట్’ ఓ కథనంలో వెల్లడించింది.
ఎందుకు 9 క్యారెట్ల బంగారం తీసుకొస్తున్నారు..?
ఇంచుమించు ప్రస్తుతం 24-క్యారెట్ల తులం బంగారం రూ.73 వేలకు పైబడి పలుకుతున్నది. 22-క్యారెట్ల తులం బంగారం ధర కూడా రూ.68 వేల పైమాటే. దీంతో దొంగలు తమ చేతివాటం చూపుతున్నారు. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం.. 2021తో పోలిస్తే, 2022లో దేశంలో గొలుసు దొంగతనాలు 32.54 శాతం మేర పెరిగాయి. దీంతో చవక బంగారంపై వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నట్టు వ్యాపారులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం 9-క్యారెట్ల బంగారాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం.
9-క్యారెట్ల తులం బంగారం ధర ఎంత ఉండొచ్చు..?
ఇంచుమించు ప్రస్తుతం 24-క్యారెట్ల తులం బంగారం రూ.73 వేలకు పైబడి పలుకుతున్నది. 22-క్యారెట్ల తులం బంగారం ధర కూడా రూ.68 వేల పైమాటే. దాన్నిబట్టి 9-క్యారెట్ల తులం బంగారం ధర రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 24-క్యారెట్లు, 22-క్యారెట్ల బంగారం నాణ్యతను ధ్రువీకరించేందుకు ఉద్దేశించిన హాల్‌మార్క్, బీఎస్‌ఐ ముద్రలు ఈ బంగారంపై కూడా ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్ 35 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 45.5 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకొన్నది. ఈ సారి భారత్ స్విట్జర్లాండ్, యూఏఈ, పెరూ, ఘనా దేశాల నుంచి ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకొంటున్నది.