JANMANREGA: మీ ఊరిలో జరిగే ఉపాధి హామీ పథకం గురించి సమగ్ర సమాచారం తెలుసుకోవాలి అనుకుంటున్నారా..!
JANMANREGA: మీ ఊరిలో జరిగే ఉపాధి హామీ పథకం గురించి సమగ్ర సమాచారం తెలుసుకోవాలి అనుకుంటున్నారా..!
• ఉపాధి హామీ పథకం కూలీల వేతన సమాచారం కోసం ఈ యాప్ లో చూడండి...
• ఒక వేళ వేతన దారుడికి నగదు జమ కాకపోయినా యాప్ లోనే కారణాలు ఉంటాయి...
• మీ ప్రాంతంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనుల సమాచారం...
• అక్కడ జరిగే అక్రమాలపై ఫిర్యాదు కూడా ఈ యాప్ లో చేయవచ్చు...
ఉపాధి హామీ పథకం కూలీలు ఒకప్పుడు తమ వేతనం ఖాతాలో జమయ్యాయో లేదో తెలుసుకొనేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఎంపీడీవో కార్యాలయానికో.. లేదంటే తపాలాశాఖ కార్యాలయానికి వెళ్లి విచారించుకునేవారు. వేతనదారులు ఇక్కట్లు పడేవారు. ఇలాంటి వాటి నుంచి బయట పడేసేందుకు కేంద్ర ప్రభుత్వం అరచేతిలో సమగ్ర సమాచారం తెలుసుకొనేలా ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ JANMANREGA యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో కూలీలు హాజరు, వేతనాలు సూచికపై క్లిక్ చేస్తే బ్లాగ్ తెరుచుకుంటుంది. రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామ పంచాయతీ, ఉపాధి జాబ్ కార్డు సంఖ్య నమోదు చేస్తే వివరాలు ప్రత్యక్షమవుతాయి. కూలీ పేరుపై క్లిక్ చేయగానే పనిచేసిన రోజులు, కూలి మొత్తం, ఏ బ్యాంకు ఖాతాకు నగదు జమైందో కనిపిస్తుంది. ఒక వేళ వేతన దారుడికి నగదు జమ కాకపోతే యాప్ లోనే కారణాలు ఉంటాయి. మరోవైపు ఉపాధి పథకంలో చేపట్టే పనుల సమాచారం, స్థానికంగా జరిగే అక్రమాలపై ఫిర్యాదుకు ఇందులో వీలుకల్పించారు. ఈ యాప్ లో అన్ని భాషల్లో వివరాలు ఉంటాయి.
సాంకేతికత ఆధారంగా..
ఉపాధి హామీ పథకంలో మరింత పారదర్శకంగా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పలు రకాలు చర్యలు తీసుకుంటుంది. సాంకేతికత ఆధారంగా పనులు పకడ్బందీగా చేపట్టాడంతో పాటు జరగుతున్న పనులు ప్రతి ఒక్కరు తెలుసుకొనేందుకు అనేక రకాలుగా యాప్ లను, ప్రత్యేక సాఫ్ట్వేరులో అందుబాటులోకి తెచ్చింది. అయితే వీటిపై అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం సాంకేతికత అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి తరుణంలో వీటిపై అధికారులు తప్పనిసరిగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.