-Advertisement-

Military School: మిలటరీ స్కూళ్లలో 6, 9 తరగతులలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

military schools near hyderabad, telangana military schools near kurnool, andhra pradesh Military schools in india Military schools list Rashtriya mil
Peoples Motivation

Military School: మిలటరీ స్కూళ్లలో 6, 9 తరగతులలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

6, 9 తరగతులలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ

కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్

దరఖాస్తులకు ఆఖరు తేదీ ఈ నెల 19

military schools near hyderabad, telangana military schools near kurnool, andhra pradesh Military schools in india Military schools list Rashtriya military schools Rashtriya Military School list Rashtriya Military School fees

దేశవ్యాప్తంగా ఉన్న మిలటరీ స్కూళ్లలో 6, 9వ తరగతులలో అడ్మిషన్లు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఐదో తరగతి పూర్తిచేసిన లేదా చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు ఈ నెల 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

మీ పిల్లలను మిలటరీ స్కూల్ లో చేర్పించాలని చూస్తున్నారా... అయితే, ఈ వివరాలు మీకోసమే. రాష్ట్రీయ మిలటరీ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.

అదేవిధంగా తొమ్మిదో తరగతిలో అడ్మిషన్ కోసం ఎనిమిదో తరగతి పూర్తిచేసిన లేదా చదువుతున్న వారు అర్హులని చెప్పారు. కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

అర్హతలు..

6వ తరగతిలో ప్రవేశానికి...

ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి పూర్తిచేసి ఉండాలి. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న వారు కూడా అర్హులే. వయసు 10 నుంచి 12 ఏళ్ల మధ్య ఉండాలి.

9వ తరగతిలో ప్రవేశానికి...

ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 8వ తరగతి పూర్తిచేసి ఉండాలి. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న వారు కూడా అర్హులే. వయసు 13 నుంచి 15 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక జరిగేదిలా..

కామన్ ఎంట్రెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్.. ఆయా టెస్ట్ లలో ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్ల ప్రకారం సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఈ ఎంపిక ప్రక్రియ కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది.

చివరి తేదీ: సెప్టెంబర్ 19 లోగా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు కింది వెబ్ సైట్ ను సందర్శించండి

www.rashtriyamilitaryschools.edu.in

Comments

-Advertisement-