Mobile: కాలేజీ బాత్రూంలో మొబైల్ వీడియోల కలకలం.. ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్ట్
కాలేజీ బాత్రూంలో మొబైల్ వీడియోల కలకలం.. ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్ట్
• బెంగళూరు ఉమెన్స్ కాలేజీ వాష్రూమ్లో మొబైల్ కలకలం...
• అమ్మాయిల దృశ్యాలు రికార్డింగ్ చేస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్ట్...
• ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించిన నిందితుడు...
• నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు...
బెంగళూరు కుంబల్గాడులోని ఏసీఎస్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల బాత్ రూం లో అమ్మాయిల దృశ్యాలు కలకలం రేపాయి. కుంబల్గాడులోని ఏసీఎస్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల బాత్ రూం లో అమ్మాయిల దృశ్యాలను 21 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి మొబైల్లో షూట్ చేశాడు. దీన్ని గమనించిన సహా విద్యార్థులు.. నిందితుడిని డైరెక్ట్ గా పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. మొబైల్ స్వాధీనం చేసుకుని పరిశీలించగా అందులో రికార్డింగ్ చేసిన వీడియోలు ప్రత్యక్షమయ్యాయి.
ఈ సంఘటన కళాశాల అంతటా వ్యాప్తి చెందడంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుడు.. అమ్మాయిల వ్యక్తిగత జీవితంతో మొబైల్లో రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రసారం చేసేవాడని ఆరోపించారు. పరిస్థితులు అదుపుతప్పకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిందితుడు కంప్యూటర్ సైన్స్ విద్యార్థి. తోటి విద్యార్థులే అతగాడి మొబైల్లో వీడియోలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఎవరికైనా చెబితే చంపేస్తానని నిందితుడు.. విద్యార్థులను కూడా బెదిరించాడు.
ఇది వరకే గత నెలలో ఏపీలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో మహిళా టాయిలెట్లో కొందరు విద్యార్థినులు రహస్య కెమెరాను గుర్తించడంతో పెద్ద దుమారమే చెలరేగింది. కృష్ణా జిల్లా ఎస్ఆర్ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విద్యార్థుల వాష్రూమ్లో అలాంటి రహస్య కెమెరాలు ఏమీ కనిపించలేదని పోలీసులు తెలిపారు.