PM KISAN: పిఎం కిసాన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి.? లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో లేదో ఇలా తనిఖీ చేయండి..?
PM KISAN: పిఎం కిసాన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి.? లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో లేదో ఇలా తనిఖీ చేయండి..?
👉 https://pmkisan.gov.in/ ని సందర్శించి., 'కొత్త రైతు నమోదు’పై క్లిక్ చేసి, ఆధార్ నంబర్ ను నమోదు చేయండి.
👉 PM కిసాన్ దరఖాస్తు ఫారమ్ 2024లో అవసరమైన సమాచారాన్ని పూరించండి. దానిని సేవ్ చేయండి.
• ఇంకా భవిష్యత్తు సూచన కోసం ప్రింటవుట్ తీసుకోండి. ఈ పథకానికి సంబంధించిన తాజా సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
లబ్ధిదారులు తమ స్థితిని ఇలా తనిఖీ చేసుకోవచ్చు..
• మొదట https://pmkisan.gov.in/ అధికారిక వెబ్సైట్కి వెళ్లి., అక్కడ 'నో యువర్ స్టేటస్' ట్యాబ్పై క్లిక్ చేయండి.
• అక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా కోడ్ను నమోదు చేసి, ‘డేటా పొందండి' ఎంపికను ఎంచుకోండి. అక్కడ మీ స్థితి కనిపిస్తుంది.
లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో లేదో ఇలా తనిఖీ చేయండి..
పీఎం కిసాన్ పథకం లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోవడానికి ముందుగా మీరు అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in/)కి వెళ్లండి. అక్కడ కిందకు స్క్రాల్ చేసినప్పుడు ఫార్మర్స్ కార్నర్ (Farmers Corner) అనే విభాగం కనిపిస్తుంది. ఆ విభాగంలోని Know Your Status క్లిక్ చెయ్యాలి.
Know Your Status క్లిక్ చేసినప్పుడు ప్రత్యేక పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ లబ్దిదారులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చెయ్యాలి. తర్వాత పక్కన కాప్చా కోడ్ ఇవ్వాలి. తర్వాత Get OTP క్లిక్ చెయ్యాలి. వారి మొబైల్‌కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చెయ్యాలి. అప్పుడు లబ్దిదారుల లిస్ట్ ఓపెన్ అవుతుంది. తద్వారా మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు.
కొంతమందికి తమ రిజిస్ట్రేషన్ నంబర్ ఏంటో గుర్తు ఉండకపోవచ్చు. అలాంటి వారు.. Know Your Status క్లిక్ చెయ్యాలి. అక్కడ ఓపెన్ అయ్యే పేజీలో Know your registration no ఆప్షన్ ఎంచుకోవాలి. దాన్ని క్లిక్ చేసినప్పుడు మరో పేజీ ఓపెన్ అవుతుంది. మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఇవ్వడం ద్వారా.. రిజిస్ట్రేషన్ నంబర్ తెలుసుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా.. తిరిగి జాబితాలో మీరు ఉందో లేదో చూసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద, అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000, అంటే సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక సహాయం అందజేస్తారు. ఏప్రిల్ – జూలై, ఆగస్టు - నవంబర్, డిసెంబర్ – మార్చి ఇలా మూడు వాయిదాలలో మొత్తం ఇవ్వబడుతుంది. ఇందులో భాగంగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నిధులు జమ చేస్తారు. ఈ పథకాన్ని 2019 మధ్యంతర బడ్జెట్లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఆ తరువాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.