Rainy Season: వర్షాలతో వ్యాధుల ముప్పు..గోరు వెచ్చని నీటినే తాగండి!
Rainy Season: వర్షాలతో వ్యాధుల ముప్పు..గోరు వెచ్చని నీటినే తాగండి!
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఆరోగ్య కేంద్రాలకు రోగుల తాకిడి పెరిగింది. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో వైద్యులు, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. ఎక్కడా సమస్యలు ఎదురవకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి' అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తున్నారు..
కాచిన నీరు శ్రేయస్కరం వర్షాల నేపథ్యంలో తాగునీరు కలుషితమయ్యే ప్రమాదముంది. దీనికితోడు కొత్త నీరు వస్తుందటంతో ప్రతిఒక్కరూ కాచి వడపోసిన గోరు వెచ్చని నీటిని తాగాలి. ఆహార పదార్ధాలు నిల్వ చేయకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు తయారు చేసుకోవడం.. వేడిగా ఉన్న పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ముఖ్యంగా దోమలు, ఈగలు, క్రిమికీటకాలు లేకుండా చూసుకోవాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
• తినకముందు, మల విసర్జనకు వెళ్లి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఈ ఇంటి చుట్టుప కల నీరు నిల్వ ఉంటే వెంటనే మట్టితో కప్పే యాలి. లేదా గ్రామ కార్యదర్శికి గానీ.. సర్పంచి. వార్డు సభ్యుడికి సమస్య వివరించి పరిష్కరించుకోవాలి.
• పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, పాత నీళ్ల సీసాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ముఖ్యంగా వాటిని తొలగించేలా చూడాలి.
• ఇంట్లోకి దోమలు రాకుండా ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకల్లా తలుపులు, కిటికీలు మూసే యాలి.
• వేపాకుతో ఇంట్లో పొగవేసుకోవడం ద్వారా దోమ కాట్ల నుంచి బయటపడొచ్చు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా దోమ తెరలు వాడాలి.
• బయట ప్రదేశాల్లో వండిన ఆహార పదార్థాలు.. చిరుతిళ్లకు దూరంగా ఉండాలి.
• ప్రతిరోజూ శుభ్రంగా స్నానం చేసి ఉతికిన దుస్తులే ధరించాలి.
• వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతలు చల్లటి గాలిలో తిరగకూడదు. వర్షంలో తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
మీ ఇంట్లోగానీ.. చుట్టు పక్కలవారు జ్వరం, వాంతులు ఇతర సమస్యలతో బాధపడుతుంటే వెంటనే స్థానికంగా ఉన్న ఆశా, ఆరోగ్య కార్యకర్త లేదా ఎంఎల్రాహెచ్పీకి సమాచారం ఇవ్వాలి. స్థానికంగా ఉన్న ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వైద్యసేవలు పొందాలి.