-Advertisement-

RRB: ఆర్ఆర్‌బీ NTPC నోటిఫికేషన్ విడుదల.. అర్హత, ఫీజు వివరాలివే

RRB NTPC Notification 2024 RRB JE Notification 2024 Rrb ntpc notification 2024 short notice Railway Recruitment 2024 Apply Online last date RRB para
Peoples Motivation

RRB: ఆర్ఆర్‌బీ NTPC నోటిఫికేషన్ విడుదల.. అర్హత, ఫీజు వివరాలివే

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) RRB NTPC 2024 అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేషన్ పోస్టుల భర్తీ కోసం నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసింది.

RRB NTPC Notification 2024 RRB JE Notification 2024 Rrb ntpc notification 2024 short notice Railway Recruitment 2024 Apply Online last date RRB para

RRB: ఆర్ఆర్‌బీ NTPC నోటిఫికేషన్ విడుదల.. అర్హత, ఫీజు వివరాలివే

కేంద్ర ప్రభుత్వం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ( RRB ) RRB NTPC 2024 అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేషన్ పోస్టుల భర్తీ కోసం నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసింది. రైల్వే రిక్రూట్‌మెంట్ కంట్రోల్ బోర్డ్(RRCB) ఈ లింక్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంటాయి. ఈ లింక్ క్లిక్ చేసి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ స్థాయి ఉద్యోగ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 14న ప్రారంభమై.. అక్టోబర్ 13న ముగుస్తుంది. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి దరఖాస్తుదారు ప్రక్రియ సెప్టెంబర్ 21న ప్రారంభమై అక్టోబర్ 13న ముగుస్తుంది.

రైల్వే రిక్రూట్‌మెంట్ వివరాలు

మొత్తం ఖాళీలు: 11,558 పోస్టులు

గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు: 8,113 పోస్టులు

చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్: 1,736 పోస్టులు

స్టేషన్ మాస్టర్: 994 పోస్టులు

గూడ్స్ రైలు మేనేజర్: 3,144 పోస్టులు

జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: 1,507 పోస్టులు

సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 732 పోస్టులు

అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు: 3,445 పోస్ట్‌లు

కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2,022 పోస్టులు

అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 361 పోస్టులు

జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 990 పోస్టులు

ట్రైన్స్ క్లర్క్: 72 పోస్టులు

దరఖాస్తు రుసుము

ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళలు, పీడబ్ల్యూబీడీ, ట్రాన్స్‌జెండర్లు, మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఈబీసీ) అభ్యర్థులకు దరఖాస్తు రుసుం రూ. 250 కాగా, మిగతా వారందరూ రూ. 500 చెల్లించి అప్లై చేసుకోవాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)కు హాజరైన తర్వాత ఫీజులో కొంత భాగం తిరిగి చెల్లిస్తారు. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకోవాలనుకుంటే తరచూ ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌ను చెక్ చేస్తూ ఉండండి.

RRB NTPC 2024 ఎంపిక ప్రక్రియ

మొదట ఆన్‌లైన్ పరీక్ష స్టెజ్ 1 - CBT 1 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ఉంటుంది. దీనిలో ఉత్తీర్ణులైన వారికి ఆన్‌లైన్ పరీక్ష స్టేజ్ 2 - CBT 2 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఆయా పోస్టులను బట్టి టైపింగ్ టెస్ట్ (స్కిల్ టెస్ట్)/ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్టుల్లో పాసైన వారికి తర్వాత దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. చివరకు వైద్య పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి

ముందుగా అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ని సందర్శించండి

అక్కడ మీ ఖాతాను సృష్టించండి

ఖాతాను సృష్టించిన తర్వాత, మొబైల్ నంబర్/ఇమెయిల్, పాస్‌వర్డ్‌తో సైన్ ఇన్ చేయండి

దరఖాస్తు ఫారమ్‌లో అవసరమైన సమాచారాన్ని పూరించండి

ఆ తర్వాత అప్లై చేసుకున్న దరఖాస్తు ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపర్చుకోండి

Comments

-Advertisement-