SSC JOBS: పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
SSC JOBS: పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
SC దాదాపు ఏటా సాయుధ 'దళాల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేస్తోంది. పదో తరగతి విద్యార్హతతో, జనరల్ అభ్యర్థులు 23 ఏళ్ల వయసు వరకు పోటీ పడవచ్చు. అందువల్ల వీటిని లక్ష్యంగా చేసుకున్నవారు విజయం సాధించడానికి అవకాశాలెక్కువ. ఆసక్తి, మెరిట్ ప్రకారం అభ్యర్థులు.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సశస్త్ర సీమాబల్ (SSB), ఇండో టిబెట న్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF), అస్సాం రైఫిల్స్ (AR), నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (NCB)లో ఏదైనా ఎంచుకోవచ్చు.
NCBకీ లెవెల్-1 మూలవేతనం రూ.18,000 దక్కుతుంది. వీరికి అన్నీ కలిపి రూ.35,000 పొందొచ్చు. మిగిలిన విభాగాల్లో లెవెల్-3 మూల వేతనం రూ.21,700 పొందుతారు. దీనికి అదనంగా డీఏ, హెచ్ఎస్ఏ, ఇతర ప్రోత్సాహకాలూ దక్కుతాయి తొలి నెల నుంచే సుమారు రూ.40 వేల జీతం అందుకోవచ్చు. అనుభవంతో హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సై స్థాయికి చేరుకోవచ్చు. విధుల్లో ప్రతిభ, విద్యార్హతలు, శాఖాపరమైన పరీక్షలతో ఎస్సై, ఆపై స్థాయిలో సేవలు అందించవచ్చు.
పదో తరగతి విద్యార్హతతోనే యూనిఫాం ఉద్యోగాలకు అవకాశమొచ్చింది. కేంద్ర సాయుధ దళాల్లో 39,481 కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్ఈసీ) ప్రకటన వెలువడింది. తెలుగులోనూ పరీక్ష రాసుకోవచ్చు. మహిళలూ అర్హులే. కంప్యూటర్ బేస్డ్, దేహదార్థ్య, శారీరక ప్రమాణ, ఆరోగ్య పరీక్ష లతో ఎంపిక చేస్తారు. వీరిని శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. మొదటి నెల నుంచే సుమారు రూ.40,000 వేతనం అందుకోవచ్చు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికీ చేరుకోవచ్చు.
ముఖ్య సమాచారం
ఖాళీలు: 39,481. విభాగాలవారీ.. BSF- 15,654, CISF-7145, CRPF-11,541, SSB-819, ITBP-3017, AR-1248, SSF-35, NCB-22. మొత్తం పోస్టుల్లో 3869 మహిళలకు కేటాయించారు.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత
వయసు: జనవరి 1, 2025 నాటికి 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. జనవరి 2, 2002 - జనవరి 1, 2007 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ లకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయ సులో సడలింపులు వర్తిస్తాయి.
ఆన్లైన్ దరఖాస్తులు: అక్టోబరు 14 రాత్రి 11 వరకు స్వీకరిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ. వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు మినహాయించారు.
పరీక్ష: జనవరి - ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. తేదీలు తర్వాత ప్రకటిస్తారు.
పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖ పట్నం. తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
మిగతా సమాచారం కోసం ఇక్కడ లింకు పై క్లిక్ చేయండి https://ssc.gov.in/