SSC JOBS: అభ్యర్థులకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ హెచ్చరిక... అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలే
SSC JOBS: అభ్యర్థులకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ హెచ్చరిక... అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలే
డిల్లీ, (పీపుల్స్ మోటివేషన్):-
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల్లో సిబ్బంది కానీ, అభ్యర్థులు కానీ ఎలాంటి అక్రమాలకు పాల్పడినా చట్టపరమైన, క్రమశిక్షణాపరమైన చర్యలు తీసుకుంటామని స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) స్పష్టం చేసింది. పరీక్ష పత్రాలను బహిర్గతం చేయడం, జిరాక్స్ ఇతరులకు చేరవేయడం, మౌఖికంగా వెల్లడించడం వంటివి ఎలక్ట్రానిక్ సహా ఏ రూపంలో చేసినా తీవ్రమైన నేరంగానే పరిగణిస్తామని ప్రభుత్వ ఉద్యోగ నియామక సంస్థ అయిన SSC హెచ్చరించింది. పరీక్ష కేంద్రాల నుంచి రఫ్ పేపర్లను తీసుకెళ్లడం, అనధికారికంగా ప్రశ్న పత్రాలను కలిగి ఉండడాన్ని దుష్ప్రవర్తనగానే భావించి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు సంబంధించి నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీ నియామక పరీక్షలను SSC నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.