Telangana: ఆరోగ్యశాఖలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
Telangana: ఆరోగ్యశాఖలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్థులకు సువర్ణావకాశం.. తెలంగాణ రాష్ట్రంలోని వైద్య ఆరోగ్యశాఖలో 2050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్సు) పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన నిరుద్యోగుల నుంచి సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ/ వైద్యవిద్య డైరెక్టరేట్ పరిధిలో 1576 స్టాఫ్ నర్సు పోస్టులు, తెలంగాణ వైద్య విధానపరిషత్ పరిధిలో 332, ఎంఎన్ క్యాన్సర్ ఆసుపత్రిలో 80, ఆయుష్ 61, ఐపీఎంలో ఒక స్టాఫ్ నర్సుతో కలిపి మొత్తం 2050 పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబరు 17న నర్సింగ్ ఆఫీసర్ల ఎంపికకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్ సహా 13 కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుంది. రాతపరీక్షకు 80 పాయింట్లు ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుకు 20 పాయింట్ల వెయిటేజీ ఉంటుంది..
ముఖ్యమైన సమాచారం
నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్): 2,050 పోస్టులు
జోన్ల వారీగా పోస్టుల ఖాళీలు:
జోన్ 1-241,
జోన్ 2-86,
జోన్ 3-246,
జోన్ 4- 353,
జోన్ 5-187,
జోన్ 6-747,
జోన్ 7-114.
శాఖల వారీగా ఖాళీలు:
1. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్/ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్: 1,576 పోస్టులు
2. తెలంగాణ వైద్య విధాన పరిషత్: 332 పోస్టులు
3. ఆయుష్: 61 పోస్టులు
4. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్: 01 పోస్టు
5. ఎంఎనో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజినల్ క్యాన్సర్ సెంటర్: 80 పోస్టులు
అర్హతలు: జనరల్ నర్సింగ్, మిడ్వైఫరీ (జీఎన్ఎం) లేదా బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో వివరాల నమోదు చేసుకొని ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కనిష్ఠ వయోపరిమితి 18 ఏళ్లు. గరిష్ఠ వయోపరిమితి గతంలో 44 ఏళ్లు ఉండగా తాజాగా 46 ఏళ్లకు పెంచారు. గరిష్ఠ వయోపరిమితిలో దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల సడలింపు, ఎక్ససర్వీస్మెన్, ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్నవారికి మూడేళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్షకు 80 పాయింట్లు ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుకు 20 పాయింట్ల వెయిటేజీ ఉంటుంది.
రాత పరీక్ష: కంప్యూటర్ ఆధారిత పరీక్షలో 80 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట.
దరఖాస్తు రుసుము: రూ.700. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు రూ.500.
ముఖ్య తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 28.9.2024.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14-10-2024.
దరఖాస్తు సవరణ తేదీ: 16.10.2024 17.10.2024 2.
పరీక్ష తేదీ (సీబీటీ): 17.11.2024.
ఇతర ముఖ్యాంశాలు..
• తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్సు) పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
• అర్హులు సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.