TG BHARATH: నా పేరు చెప్పుకొని బెదిరిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి: రాష్ట్ర మంత్రి టి.జి భరత్
General News telugu latest news telugu intresting news telugu intresting facts
Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
By
Peoples Motivation
TG BHARATH: నా పేరు చెప్పుకొని బెదిరిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి: రాష్ట్ర మంత్రి టి.జి భరత్
చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నేను ఎప్పటికీ ప్రోత్సహించను: మంత్రి టి.జి భరత్
తన పేరు చెప్పుకొని ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వారిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. తన పేరును వాడుతూ డబ్బుల కోసం బెదిరిస్తున్నట్లు వస్తున్న వార్తలపై మంత్రి టి.జి భరత్ ఘాటుగా స్పందించారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను తాను ఎప్పటికీ ప్రోత్సహించనని మంత్రి టి.జి భరత్ పేర్కొన్నారు. నిజాయితీగా ఉంటూ దశాబ్దాలుగా ప్రజాక్షేత్రంలో ఉన్నామని.. తన పేరును దుర్వినియోగం చేస్తూ ప్రజలను, ఇతర వర్గాలను ఇబ్బందులు పెడితే సహించబోనని చెప్పారు. తాము ఏ పని చేసినా పారదర్శకంగా ఉంటుందని.. ఇది ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందన్నారు. ప్రజలందరూ ఇది గుర్తుంచుకోవాలని ఆయన కోరారు. అవినీతిపరులు, అక్రమార్కుల నుండి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని మంత్రి టి.జి భరత్ ఒక ప్రకటన ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Comments