-Advertisement-

TG DSC 2024: తెలంగాణ డీఎస్సీ ఫైనల్ కీ విడుదల

Ts tet result TS TET Hall Ticket TS TET Result 2024 ts tet.cgg.gov.in 2024 Ts tet login TS TET Hall Ticket download 2024 TS TET 2024 AP TET AP DSC new
Peoples Motivation

TG DSC 2024: తెలంగాణ డీఎస్సీ ఫైనల్ కీ విడుదల

Ts tet result TS TET Hall Ticket TS TET Result 2024 ts tet.cgg.gov.in 2024 Ts tet login TS TET Hall Ticket download 2024 TS TET 2024 AP TET AP DSC new

హైదరాబాద్, (పీపుల్స్ మోటివేషన్):-

TG DSC 2024: తెలంగాణ రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీ వచ్చేసింది. ఆగస్టు 13న ప్రిలిమినరీ కీ విడుదల చేసిన అనంతరం.. అభ్యంతరాలను పరిశీలించిన పాఠశాల విద్యాశాఖ అధికారులు సెప్టెంబర్ 6 వ తేదీన కీని విడుదల చేశారు. తుది కీని అభ్యర్థులు విద్యా శాఖ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ డీఎస్సీ తుది కీని స్కూల్ అసిస్టెంట్,లాంగ్వేజ్ పండిట్, సెకెండరీ గ్రేడ్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల కోసం సంబంధిత అధికారిక వెబ్సైట్లో ఉంచారు. ఈ ఫైనల్ కీ ద్వారా డీఎస్సీ అభ్యర్థులు తమ మార్కులను తెలుసుకోవచ్చు. త్వరలోనే ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఫైనల్ కీ కోసం కింది వెబ్సైట్పై క్లిక్ చేయండి.

ఫైనల్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Comments

-Advertisement-