-Advertisement-

Wines: అక్టోబర్ 1 నుంచి ఏపీలో మారనున్న వైన్ షాప్ ల టైమింగ్స్.. కొత్త టైమింగ్స్ ఇవే

AP liquor policy 2024 Ap new liquor policy 2024 price list New liquor policy in ap rates Ap new liquor policy 2024 price list pdf AP New Liquor rates
Peoples Motivation

Wines: అక్టోబర్ 1 నుంచి ఏపీలో మారనున్న వైన్ షాప్ ల టైమింగ్స్.. కొత్త టైమింగ్స్ ఇవే

>> ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు వైన్స్ ఓపెన్...

>> లాటరీ విధానంలో వైన్స్ షాపుల కేటాయింపు...

>> తక్కువ ధరలకు క్వాలిటీ మద్యం అందిస్తామన్న మంత్రి...

>> రెండేళ్ల పరిమితితో షాప్ లైసెన్సుల మంజూరు..

AP liquor policy 2024 Ap new liquor policy 2024 price list New liquor policy in ap rates Ap new liquor policy 2024 price list pdf AP New Liquor rates

అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త మద్యం పాలసీ ప్రకారం.. మద్యం ప్రియులకు ఏపీ సర్కారు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు లిక్కర్ షాపులను తెరిచి ఉంచనున్నట్లు పేర్కొంది. తక్కువ ధరలకు నాణ్యమైన మద్యం అందిస్తామని మంత్రి పార్థసారథి చెప్పారు. రాష్ట్రంలో అన్ని రకాల మద్యం బ్రాండ్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. 

రెండేళ్ల కాల పరిమితితో లైసెన్సులు జారీ...

మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంటుందని కేబినెట్ కూడా స్పష్టం చేసింది. వైన్స్ షాపుల కేటాయింపులో లాటరీ విధానం అవలంబిస్తామని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. రెండేళ్ల కాల పరిమితితో లైసెన్సులు జారీ చేస్తామన్నారు. షాపు లైసెన్స్ కోసం రూ.2 లక్షలతో దరఖాస్తు చేసుకోవాలని, లాటరీ పద్ధతిలో లైసెన్స్ దక్కినా దక్కకున్నా ఈ మొత్తం తిరిగి ఇవ్వబడదని (నాన్ రిఫండబుల్) మంత్రి చెప్పారు. గీత కార్మికులకు వైన్స్ షాప్ లైసెన్సులలో 10 శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Comments

-Advertisement-