రబీపంటలను డిసెంబర్ 15 లోగా ఇన్సూరెన్స్ చేయించాలి
రబీపంటలను డిసెంబర్ 15 లోగా ఇన్సూరెన్స్ చేయించాలి
-అగ్రికల్చర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్
రాష్ట్రంలో రబీ కాలంలో జీడి మామిడి పంటలు నవంబర్ 15 లోగా, రాయలసీమ ఇతర ప్రాంతంలో మిగిలిన పంటలు డిసెంబర్ 15 లోపల ఇన్సూరెన్స్ చేయించాలని , కౌలు రైతులందరికీ సిసిఆర్ కార్డ్స్ మంజూరు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
గురువారం విజయవాడ నుండి స్పెషల్ చీఫ్ సెక్రెటరీ
పంటల బీమా అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు..
ఈ సందర్భంగా అగ్రికల్చర్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్, అగ్రికల్చర్ డైరెక్టర్ ఎస్. ఢిల్లీ రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రస్తుతం రబీ కాలంలో ఉన్న పంటలన్నీ ఇన్సూరెన్స్ చేయించాలని ఆదేశించారు. అవసరమైన రైతులకు సిసిఆర్ కార్డ్స్ వెంటనే మంజూరు చేయించాలని, వారికి సమీపంలోని బ్యాంకు నుండి పంట రుణాలు ఇప్పించాలని కోరారు. కౌలు రైతులు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులకు పంటలు నష్టపోయే అవకాశం ఉన్నందున వారికి ప్రతి పంటకు ఇన్సూరెన్స్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కౌలు రైతులకు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.
వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య , అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి , సిపిఓ హిమ ప్రభాకర్ రాజు , జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి , హార్టికల్చర్ అధికారి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.