అక్టోబర్ 16 వ తేదిన కౌతాళం మండలం మరళిలో ఇసుక ఓపెన్ రీచ్ ను ప్రారంభించాలి
అక్టోబర్ 16 వ తేదిన కౌతాళం మండలం మరళిలో ఇసుక ఓపెన్ రీచ్ ను ప్రారంభించాలి
• మరిన్ని ఇసుక రీచులు ప్రారంభించేందుకు పరిశీలన జరపాలి
• అక్రమంగా ఇసుకను తరలించకుండా టాస్క్ఫోర్స్ అధికారులు, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండాలి
-జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, అక్టోబర్ 08 (పీపుల్స్ మోటివేషన్):- అక్టోబర్ 16 వ తేదిన కౌతాళం మండలం మరళిలో ఇసుక ఓపెన్ రీచ్ ను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 16వ తేదీ నుండి మరళి ఇసుక రీచ్ ఆపరేషన్ లోకి రావాలని కలెక్టర్ స్పష్టం చేశారు.. ఈనెల 10వ తేదీ కి టెండర్ టైం ముగుస్తుందని, తదుపరి బిడ్డర్లను ఎంపిక చేసి, 16 వ తేదీ కి రీచ్ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని గనులు శాఖ డీడిని ఆదేశించారు.. ప్రజలకు ఇసుక సులభంగా అందించేందుకు వీలుగా, జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఇసుక లభ్యత ప్రదేశాలు ఏవైనా ఉన్నాయా పరిశీలించాలని కలెక్టర్ ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, రెవెన్యూ ఆర్డబ్ల్యూఎస్, మైనింగ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పనులకు ప్రాధాన్యతను ఇస్తూ ఇసుకను కేటాయించాలని కలెక్టర్ ఆదేశించారు..
అక్రమంగా ఇసుకను తరలించకుండా టాస్క్ఫోర్స్ అధికారులు, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, గనుల శాఖ డిడి రవిచంద్, కర్నూలు ఆర్డీఓ సందీప్, డిఎస్పీ బాబు ప్రసాద్, ఆర్డబ్లూఎస్ ఎస్ఈ నాగేశ్వర రావు, డిపిఓ భాస్కర్, డిటిసి శాంతకుమారి, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.